Site icon Prime9

Janasena Activist : జనసేన ఫ్లెక్సీ చించినందుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జన సైనికుడు.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా !

janasena activist warning to opponents for damaging janasena flexy

janasena activist warning to opponents for damaging janasena flexy

Janasena Activist : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైకాపా – జనసేన మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంటుంది.

కాగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన భామిని మండలం లో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 

అయితే ఆ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో వివాదం ముదిరింది. 

దీంతో ఫ్లెక్సీ చింపిన దుండగులకి జనసేన నేత కిరణ్, జనసైనికులు అదిరిపోయే రేంజ్ లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

సౌండ్ బాక్స్ లు పెట్టి మాస్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది.   

 

 

బస్సుయాత్రకి సిద్దమవుతున్న జనసేనాని..

కాగా మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి తో బస్సు యాత్రకి సిద్దమవుతున్నారు.

ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించి ఆలయ సన్నిధిలో ‘వారాహి’ వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురి కాగా కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు.

అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారని తెలిపారు.

రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అవుతారని.. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారని పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారు.

కాగా ఇదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శం) ను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు.

ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.

కర్నూలులో పర్యటిస్తున్న నాగబాబు..

కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న నాగబాబు జనసైనికులతో, వీర మహిళలతో సమావేశం అవుతున్నారు.

ఈ సందర్భంగా సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులను నాగబాబు కలిశారు.

సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులతో నాగబాబు సుదీర్ఘంగా చర్చించారు.

తాము అధికారంలో రాగానే.. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కర్నూలులో రెండు రోజుల పర్యటనలో భాగంగా.. జనసేన కార్యకర్తలు నాగబాబుకి ఘన స్వాగతం పలికారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version