Site icon Prime9

Jamuna: ముగిసిన జమున అంత్యక్రియలు.. వెండితెర సత్యభామకు ఇక సెలవు

senior actress jamuna passed away

senior actress jamuna passed away

Jamuna: వెండితెర సత్యభామగా ఓ వెలుగు వెలిగిన జమున అంత్యక్రియలు ముగిశాయి. జమున అంత్యక్రియలు కుటుంబ సభ్యులు.. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. పలువురు సినీ కళాకారులు జమున భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

అలనాటి నటి.. వెండితెర సత్యభామ జమున అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో దహన సంస్కారాలు ముగిశాయి. ఆమె కుమార్తె..
స్రవంతి సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. దహన సంస్కారాలను అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో తెలుగు సినీ చరిత్రలో మరో తార కనుమరుగైంది.
జమున మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, మహేష్‌, ఇతర నటులు విచారం వ్యక్తం చేశారు.

సీనియర్‌ నటి జమున ఈ రోజు ఉదయం కన్నుముశారు. ఆమె మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ.. దక్షిణాది చిత్ర పరిశ్రమ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాయంత్రం వరకు ఆమె భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. ఆ తర్వాత ఫిలిం నగర్‌లోని మహాప్రస్థానానికి తరలించారు.

ప్రస్తుతం ఆమె వయసు 86 సంవత్సరాలు.. కాగా అనారోగ్య కారణాల వల్ల జమున మృతి చెందినట్లు భావిస్తున్నారు.

1936 ఆగస్ట్‌ 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి.

జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.

ఆమె నటించిన తొలిచిత్రం పుట్టిల్లు.

jamuna

రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది.

మేటి తరం కథానాయికలలో అగ్ర తారల్లోజమున కూడా ఒకరు.

మహానటి సావిత్రితో పాటు పలు సినిమాల్లో జమున కలిసి నటించారు.

తన అందంతోనే కాకుండా, అభినయం, నృత్యాలతో ఆమె ప్రేక్షకులను అలరించారు.

జమున కర్ణాటకలోని జన్మించిన.. తెలుగు పరిశ్రమనే తన సొంత పరిశ్రమగా భావించి ఇక్కడే స్థిరపడిపోయారు.

జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు.

మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు.

తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ సినిమాల్లో ఆమె నటించారు.

తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు.

1967లో ఆమె హిందీలో నటించిన మిలన్ సినిమా.. 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.

ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్ర సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version