Jagapathi Babu : ప్రముఖ నటుడు జగపతి బాబు గురించి అందరికి తెలిసిందే.
సీనియర్ దర్శకుడు, నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు తనదైన విలక్షణ నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ, మాస్ ఆడియన్స్ లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
కాగా 2014లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ సినిమాతో జగపతి బాబు ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారనే చెప్పాలి.
అంతకు ముందు ఆయన నటించిన చిత్రాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో ఇక ఆయన పని అయిపోయింది అనుకున్నారు.
కానీ లెజెండ్ ఆయన పోషించిన పవర్ ఫుల్ విలన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఆ తర్వాత నుంచి జగ్గూ భాయ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు.
అయితే తాజాగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ఈ మేరకు నటుల్లో రాజకీయాల్లో ఉన్నవారిలో మీకు ఇష్టమైన వారు ఎవరని ప్రశ్నించగా.. అందుకు జగపతి బాబు సమాధానం చెబుతూ.. రాజకీయలతో సంబంధం ఉన్న నటుల్లో పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. అలాగే తనకు ఇష్టమైన హీరోయిన్ సౌందర్య అని.. విలన్ పాత్రలో నటించిన హీరోయిన్లలో రమ్యకృష్ణ అంటే ఇష్టమని వెల్లడించారు.
నా కూతురుకి పెళ్లి చేసుకోవద్దనే చెప్పా – జగపతి బాబు
అలానే ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కూతుళ్ళ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. జగపతి బాబుకు ఇద్దరు కూతుళ్లు.. మేఘన, అనుశ్రీ. వారిలో పెద్ద అమ్మాయికి అమెరికా అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశాను. తను అమెరికా లోనే ఉంటుంది. చిన్న కూతురికి పెళ్లి కాలేదు.. నన్ను అడిగితె నేను పెళ్లి చేసుకోవద్దనే చెప్పా.. తనకు ఇష్టం ఉండి.. పెళ్లి చేయండి అంటే.. నేను చేయను.. కావాలంటే నువ్వే ఒక అబ్బాయిని వెతుక్కొని పెళ్లి చేసుకో అని చెప్తా.. ఎవరి జీవితాన్ని శాసించే హక్కు మనకు లేదు అని అన్నారు.
తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్లు చూడాలి, వారి పిల్లలను చూడాలి అని చెప్పుకుంటూ వారి ఆశలను పిల్లల మీద రుద్దుతున్నారు. నేను అలా చేయను. అది స్వార్థం అవుతోంది. తండ్రిగా పెళ్లి చేయడం నా బాధ్యత అని చెప్పడం తప్పు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు అని మాత్రమే చెప్పాను. పెద్దమ్మాయి నాకు పిల్లలు వద్దు అంది. కుక్కలు, పిల్లులను పెంచుకొంటుంది. అది తప్పు అని నేను చెప్పలేదు.. నీ ఇష్టం అన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జగపతి బాబు చేసిన వ్యక్తలు ఇప్పడు యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/