Site icon Prime9

It Raids: కలవరపెడుతున్న ఐటీ దాడులు.. హైదరాబాద్ లో మరోసారి సోదాలు

IT Raids

IT Raids

It Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ సహా.. వివిధ జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే.. ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 50 బృందాలుగా విడిపోయిన అధికారులు.. 40 చోట్ల సోదారు నిర్వహిస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో ఐటీ దాడులు

ఆదాయపు పన్నుల్లో అవకతవకలపై ఫిర్యాదు రావడంతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఇక హైదరాబాద్ లో ప్రముఖ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్‌తో సహా.. వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.

ఫార్మా కంపెనీకి చెందిన కార్యాలయాలు.. చైర్మన్ ఇళ్ళతో పాటు డైరెక్టర్ల ఇళ్ళల్లోను సోదాలు జరుగుతున్నాయి.

వెంగళరావు నగర్ లో రెండు టీమ్ లతో పాటు.. మాదాపూర్ లోని కార్పొరేట్ కార్యాలయంలో నాలుగు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.

వసుధ ఫార్మా చైర్మన్ వెంకటరామారాజు.. డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.

వసుధ ఫార్మా పేరుతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇందులో సుమారు 15 కంపెనీల పేరుతో వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

ఫార్మా కంపెనీ ద్వారా వచ్చిన లాభాలను.. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టినట్లు గుర్తించారు.

హైదరాబాద్ లో పలు చోట్ల దాడులు

హైదరాబాద్ లో ఇది వరకే.. పలు రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై దాడులు జరిపారు.

ఇందులో పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు లభించగా.. సోదాలు చేస్తున్నారు.

ఈ ఐటీ రైడ్స్ IT Raidsమరోసారి కలకలం రేపుతున్నాయి.
ఈ దాడులతో తెలుగు రాష్ట్రాలు మళ్లీ ఉలిక్కిపడ్డాయి.
ఇది వరకే.. హైదరాబాద్ లో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరిగాయి.

ఈ దాడులు మరోసారి ప్రముఖుల గుండెల్లో కలవరం రేపుతున్నాయి.
ఈ దాడుల నేపథ్యంలో ప్రముఖులు అప్రమత్తం అవుతున్నారు.

ఉన్నట్టుండి ఐటీ అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్  లోని ప్రముఖులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

పేరుమోసిన వ్యాపరవేత్త కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

హోరాహోరీగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు | Prime9 News

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar