Site icon Prime9

Twitter: ట్విట్టర్ యూజర్లకు మరో షాక్.. వినియోగదారులంతా డబ్బు కట్టాల్సిందే..!

is-twitter-going-to-charge-a-subscription-fee

is-twitter-going-to-charge-a-subscription-fee

Twitter: ట్విట్టర్‌ యూజర్లపై ఎలాన్‌ మస్క్‌ మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్‌ యూజర్లందరి నుంచి డబ్బులు వసూలు చేసే ప్రణాళికలో మస్క్ ఉన్నారని  ప్లాట్‌ఫార్మర్‌ తన నివేదికలో వెల్లడించింది.

ట్విట్టర్‌లో ఖాతా కొనసాగించాలన్నా, కొత్త ఖాతా క్రియేట్‌ చేసుకోవాలన్నా ఇకపై సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకోవాలనే ఆలోచనలో మస్క్‌ ఉన్నారని పేర్కొనింది. దీనిపై ఉద్యోగులతో అంతర్గత సమావేశాల్లో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. యూజర్లు నెలకు పరిమిత వ్యవధి వరకు మాత్రమే ట్విట్టర్‌ను ఉచితంగా వినియోగించుకొనేలా,
ఆ తర్వాత బ్రౌజింగ్‌కు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొనేలా ప్లాన్‌ చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మరి ఇదెప్పటి నుంచి అమలవనుంది అసలు ఈ వ్యాఖ్యలపై మస్క్ ఏ విధంగా స్పందిస్తున్నారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఇదిలా ఉంటే మరోవైపు మస్క్‌ ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసిన తర్వాత అటు ఉద్యోగులకు, ఇటు యూజర్లకు షాకుల మీద షాకులు ఇస్తుండడంతో యూజర్లు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌ నుంచి చాలా మంది యూజర్లు వైదొలుగుతున్నారు. కూ, మస్టోడాన్‌ అనే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఈ అవకాశాన్ని అదునుగా ఉపయోగించుకుని యూజర్లను అట్రాక్ట్ చేస్తుండడం వల్ల సదరు యాప్ ల వైపు నెటిజన్లు మొగ్గు చూపుతున్నారు

ఇదీ చదవండి: ఇ-కామర్స్ సంస్ధ అమెజాన్ డెలివరీలో విద్యుత్ వాహనాలు.. టివిఎస్ తో ఒప్పందం

 

Exit mobile version