Site icon Prime9

Prabhas-Pawan Kalyan: ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే అప్‌డేట్‌ – పవన్‌ ఓజీలో ప్రభాస్‌ అతిథి పాత్ర…

Prabhas in Pawan kalyan OG Movie: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో లీనమయ్యారు. అయితే ఆయన అభిమానులు మాత్రం తిరిగి సినిమాలో ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్‌ చేతిలో మూడు సినిమాల ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు, సాహో డైరెక్టర్‌ సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ(ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌)తో పాటు హరీష్‌ శంకర్ డైరెక్షన్‌లో రూపొందనున్న ఉస్తాద్ భగత్‌ సింగ్. అయితే ఈ మూడు ప్రాజెక్ట్స్‌లో అందరి దృష్టి మాత్రం ఓజీ మీదే ఉంది.

పవన్ డిప్యూటీ సీఎంగా ఎలాంటి కార్యక్రమాలలో కనిపించినా జనసైనికులు ఓజీ,ఓజీ అని నినాదాలు చేస్తున్నారు. దానికి తోడు సినిమా చాలా బాగుంటుందని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ ఓ సందర్భంగా హింట్‌ ఇచ్చాడు. మరోవైపు మేకర్స్ కూడా వరుస అప్డేట్స్ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈ క్రమంలో నేడు ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఓజీకి మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది. ఇంతకి ఆ అప్‌డేట్‌ ఏంటంటే.. ప్రస్తుతం ఓజీ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

జూనియర్‌ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్‌ సీన్‌కి సంబంధించి చిత్రీకరణ జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌లో పవన్‌ కూడా జాయిన్‌ కాబోతున్నాడు. అంతేకాదు కొంతకాలం రాజకీయాలకు బ్రేక్‌ ఇచ్చి పూర్తిగా సినిమా షూటింగ్‌లోనే ఉండబోతున్నారట పవన్‌. దీంతో ఓజీ మూవీ షూటింగ్‌ని చకచక పూర్తి చేసేందుకు డైరెక్టర్‌ సుజిత్‌ అండ్‌ టీం ప్లాన్‌ చేస్తోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌గా పవన్‌ ఇందులో కనిపించబోతున్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో ఓ పాన్‌ ఇండియా స్టార్‌ అతిథి పాత్ర పోషించబోతున్నాడట. ఆ స్టార్‌ మరెవరో కాదు మన డార్లింగ్ ప్రభాస్‌.

అవును.. ప్రభాస్‌ ఓజీలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతున్నాడంటూ ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎప్పటి నుంచో ఓ రూమర్‌ ఉంది, కానీ ఇది అంతా ప్రచారం మాత్రమే అంతా కొట్టిపారేస్తున్నారు. అయితే ఈసారి దీనిపై మరింత గట్టి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల ఓజీ కాస్ట్‌ అని గూగుల్‌ సెర్చ్‌ చేయగా అందులో ప్రభాస్‌ పేరు కూడా కనిపించడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఈ జాబితా నుంచి ప్రభాస్‌ పేరు, ఫోటోను తొలగించారు. కానీ, ఇందులో ప్రభాస్‌, అతిథి పాత్ర ఉంటుందని ఇప్పటికీ దీనిపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఓజీ చివరి షూటింగ్‌ డిసెంబర్‌ జరుగనుందట. ఈ షెడ్యూల్లో పవన్‌-ప్రభాస్‌కి సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణ జరగనుందని ఇండస్ట్రీలో గుసగుస. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఈ ఏడాది చివరి వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version