Site icon Prime9

Kiran Kumar Reddy : బీజేపీ గూటికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. తెలంగాణలో కీలక పదవి ఇవ్వనున్నారా?

interesting rumours about kiran kumar reddy going to join bjp

interesting rumours about kiran kumar reddy going to join bjp

Kiran Kumar Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఇప్పుడు తాజాగా వార్తల్లో నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఈ మేరకు కిరణ్ కుమార్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టుగా సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత బీజేపీ అగ్రనేతల సమక్షంలో కిరణ్ కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం అందుతుంది.

2014 ఎన్నికల తర్వాత నాలుగేళ్ల పాటు సైలెంటుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డి అంతా యాక్టివ్‌గా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మారనున్నారనే ప్రచారం సాగుతూనే ఉంది. బీజేపీ పెద్దలు ఆయనతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగింది. అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు పార్టీలో ఏ విధమైన బాధ్యతలు అప్పగిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభపతిగా కూడా పనిచేశారు. 2010 నవంబర్‌లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా సొంతం చేసుకోలేదు.

అయితే ఇటీవలే కిరణ్‌ కుమార్‌ రెడ్డి తన స్నేహితుడు సురేష్‌ కుమార్‌ రెడ్డితో.. కలిసి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ టాక్‌ షోలో మెరిశారు. బాలయ్యకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.ఈ ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ మంచి మిత్రులు. ఆ షో లో బతికి ఉండడం వల్లే తాను సీఎం అయ్యానంటూ నల్లారి షాకిచ్చారు. అలాగే ఒక సీనియర్ మంత్రి తన విషయంలో వైఎస్ఆర్ ను తప్పుదోవ పట్టించారని నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ కు కిరణ్ కుమార్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉండేవారు.. కిరణ్ ను వైఎస్ఆర్ చాలా నమ్మకంగానే చూసేవారు. రాజకీయాల పరంగా కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వడం.. బీజేపీ కి కలిసొచ్చే అంశమేనా అని అంతా చర్చించుకుంటున్నారు.

తెలంగాణలో బీజేపీకి బండి సంజయ్, రాజా సింగ్ వంటి బలమైన నేతలు ఉన్న తరుణంలో కిరణ్ కుమార్ కుమార్ రెడ్డి వంటి మాజీ సీఎం స్థాయి నేత బీజేపీ లోకి రావడం అంటే కలిసొచ్చే అంశం అని చెప్పాలి. మరో ఈ వార్తా నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version