Site icon Prime9

WWE : డబ్ల్యూడబ్ల్యూఈ “సూపర్‌ స్టార్‌ స్పెక్టకిల్‌” కి రెడీ అయిన భాగ్య నగరం..

interesting details about WWE super star spectacle event in hyderabad

interesting details about WWE super star spectacle event in hyderabad

WWE : వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ( డబ్ల్యూడబ్ల్యూఈ ).. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడే ఈ షో కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. అండర్ టేకర్, రాక్,    రోమన్ రేయిండ్, జాన్ సీనా, బతిష్టా, ఎడ్జ్, ట్రిపుల్ హెచ్, బిగ్ షో, గ్రేట్ కాళీ.. ఇలా ఎంతోమంది ఫైటర్లు మణహి పేరుపొందారు. వీరిలో రాక్, జాన్ సీనా, బతిష్టా సినిమాల్లో కూడా నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు. అయితే మన భాగ్యనగరం వేదికగా ఈ షో జరగనుందని తెలిసిందే.

సిటీలోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ‘సూపర్‌ స్టార్‌ స్పెక్టకిల్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫైట్‌లో జాన్‌ సినాతో పాటు పలువురు ప్రముఖ రెజ్లర్లు పాల్గొంటున్నారు. ఈరోజు జరిగే ఈ ఈవెంట్‌ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ లో జరగబోతున్న ఫైట్ లో 16 సార్లు ప్రపంచ చాంపియన్‌, రెజ్లింగ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ జాన్‌ సినా కూడా బరిలోకి దిగనుండడంతో ఫ్యాన్స్ మరింతగా దీని కోసస్యం ఎఊరు చూస్తున్నారు. ఇక ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఎగబడటంతో చాలా ముందుగానే ‘బుక్‌ మై షో’లో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.

 

 

అయితే జాన్‌ సినా భారత్‌లో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. టీమ్‌ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్‌ చాంపియన్‌ రోలిన్స్‌తో కలిసి జాన్‌ సినా.. గియోవానీ విన్సీ, లుడ్విగ్‌ కై సర్ద్‌ జోడీతో తలపడతారు. మహిళల విభాగంలో డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ రియా రిప్లీ ప్రధాన ఆకర్షణ కానుంది. రాత్రి 7.30నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైట్‌ను ‘సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌’లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

అంతకు ముందు 2017 లో భారత్‌లో చివరిసారిగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్‌ జరగ్గా.. ఆరేళ్ల తర్వాత మన దేశంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా రెజ్లింగ్‌ ఫ్యాన్స్‌ ఈ ఫైట్‌ను తిలకించేందుకు వస్తున్నారు.

Exit mobile version