Site icon Prime9

Pawan Kalyan OG: OG అంటే ఏంటి? హాలీవుడ్ రేంజ్‌లో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా

interesting-details-about-pawan-kalyan-og-movie

interesting-details-about-pawan-kalyan-og-movie

Pawan Kalyan OG: యంగ్ డైరక్టర్ సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. 

డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి అన్నపూర్ణ స్టూడియోస్ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేయగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాటల్లేవు.. అన్నీ ఫైట్లే. అది కూడా మామూలు ఫైట్లు కాదు.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఫైట్లు. గ్యాంగ్ స్టర్ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.. కావాల్సినన్ని గన్‌లు.

కాగా గతంలో ఒక సినిమా ఫంక్షన్‌లో పూరీ జగన్నాథ్ ఒక మాట చెప్పారు.. ఆ మాట ఫ్యాన్స్‌కి గుర్తుండే ఉంటుంది. కథలో పాటలు ఉండవు. గన్స్ ఉంటాయి. అంటే చాలు పవన్ కళ్యాణ్ సినిమా ఒప్పేసుకుంటారు అని. ఇప్పుడు ఈ మాటే నిజం అవుతుందేమో అనిపిస్తుంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం.. ఓజీ.. గురించి ఇలాంటివి చాలా విషయాలు ట్రెండ్ అవుతున్నాయి.

(Pawan Kalyan OG) ఇంతకీ ఓజీ అంటే ఏంటి?

ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. చాలామంది గ్యాంగ్‌స్టర్‌లు ఉంటారు. కానీ ఒరిజినల్‌గా ఆ గ్యాంగ్‌ను మొదలు పెట్టింది ఎవరు? అన్నదానిపైనే సాధారణంగా గ్యాంగ్‌లకు పేర్లు ఉంటాయి. ఓజీ పేరుతో

గ్యాంగ్ ఉంది అంటే.. అది చిన్నా చితకా గ్యాంగ్ కాదన్నమాట. ఇక ఆ గ్యాంగ్‌ను ప్రారంభించిన ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గురించి చెప్పాల్సిన పనేముంది. తోపు అయితేనేకదా ఓజీ అయ్యేది.

అలాంటి ఒక ఓజీ కథే ఈ సినిమా. అలాంటి ఓజీగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడంటే.. ఇక నట విశ్వరూపమే.

పైగా, ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఇందులో గన్స్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్‌ ఇంకా ఇష్టంగా నటించే అవకాశాలూ ఉన్నాయి.

కథ ఎక్కడ జరుగుతుందంటే..

ఓజీ పోస్టర్‌లో పవన్‌ కళ్యాణ్ షాడో కనిపిస్తుంది. ఆ షాడో ఒక గన్‌లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఆ ఫొటోపై జపానీస్‌ భాష రాసి ఉంది.

పోస్టర్‌లో జపానీస్ భాషలో రాసి ఉన్న ఆ అక్షరాల అర్థం అగ్నితుఫాన్‌ అని.

అందుకే #FireStormIsComing అనే హ్యాష్‌ట్యాగ్ గత కొన్ని రోజులుగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) నీడలో గన్‌ కనిపిస్తుంది. పవన్‌ ముందు ఉన్న వృత్తాకారం, ఎరుపు రంగు జపాన్‌ జాతీయ జెండాను గుర్తు చేస్తోంది.

అలాగే పోస్టర్‌లో ఒక వైపు విగ్రహం ఆకారం కనిపిస్తోంది. అది జపాన్‌ లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం. ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో ఉంది.

ఇకపోతే పోస్టర్‌లో మరోవైపు ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా కనిపిస్తుంది.

దీనిని బట్టి ఈ సినిమా కథ జపాన్‌, ముంబయి నేపథ్యంలో సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రభాస్ సాహోతో లింకు ఉంటుందా?

మరి ఓజీ సినిమా ఎలా ఉండబోతుందనే అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ లో కొంత వరకే కనిపిస్తారని సెకండ్ ఆఫ్లో ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుందని అంటున్నారు.

ప్రభాస్ నటించిన సాహో సినిమాకి .. ఈ సినిమాకి లింక్ ఉందట.. ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తారో లేదో సస్పెన్స్ గా చెబుతున్నారు.

ఆ మూవీ లోని పాత్రల గురించి అయితే ప్రస్తావిస్తారని టాక్ నడుస్తుంది.

హాలీవుడ్‌ ఫిల్మ్‌ అనుభూతిని అందించేలా మూవీ మేకింగ్‌ ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.

ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే సాంగ్స్, డ్యాన్స్ లేకుండానే మూవీ రన్ అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

అంతేకాకుండా ఈ మూవీ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో వచ్చిన సాహో మూవీ క్లైమాక్స్ కి కనెక్ట్ అయ్యి ఉంటుందని చెప్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో #FireStormIsComing, #PawanKalyan #OG ట్యాగ్ లు ట్రెండింగ్ గా మారాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version