Site icon Prime9

BRS Party : ఢిల్లీలో ఫుల్ బిజీగా కేసీఆర్… ” బీఆర్ఎస్ ” తో పాటు ఆ పని కోసమే యాగం చేస్తున్నారా !

kcr

kcr

BRS Party : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూ మరో వైపు దేశ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు బాటలు వేస్తున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించిన కేసీఆర్ అందుకు తగిన పనుల్లో నిమగ్నమయ్యారు. పరికి సంబంధించి జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న ఢిల్లీ లోని సర్దార్‌ పటేల్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభం కానుంది.

ఈ మేరకు సోమవారం నాడు కేసీఆర్ ఢిల్లీకి చేరుకొని… పార్టీ కార్యాలయ భవన పనులపై ఎంపీలతో మాట్లాడారు. ఈ తరుణంలోనే నేడు సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకలాపాల్లో కేసీఆర్ దంపతులు కలిసి పాల్గొంటారు. అనంతరం కేసీఆర్ సతీసమేతంగా రాజశ్యామల, నవచండీ యాగాలు నిర్వహిస్తారు. ఈ హోమాలు చేసేందుకు శృంగేరీ పీఠం నుంచి 12 మంది రుత్వికులు రానుండగా… గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరగనున్నాయి. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను వేముల, సంతోష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు పరిశీలించారు. దైవ కృప, బీఆర్ఎస్ విజయవంతం కావడం, దేశం సుభిక్షంగా ఉండటానికి యాగాన్ని కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

కాగా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం దృష్ట్యా ఢిల్లీలో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో.. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌, ‘కేసీఆర్‌ ఫర్‌ ఇండియా, దేశ్‌ కీ నేత.. కిసాన్‌ కీ భరోసా, అనే నినాదాలతో హోర్లిండ్ లు ఏర్పాటయ్యాయి. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు తదితరులను కేసీఆర్‌ ఇప్పటికే ఆహ్వానించారు. వీరితో పాటు జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ సైతం హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

Exit mobile version