Maha Pada Yatra: మహా పాదయాత్రకు వినూత్న స్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి జెఏసి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ మహా పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. అమరావతి నుండి అరసువల్లి వరకు తలపెట్టిన పాద యాత్ర బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది

Innovative welcome to Maha Pada Yatra: మహా పాదయాత్రలో ఓవైపు శ్రీవారి రధం, మరో వైపు అశేషంగా నడిచివస్తున్న రైతుల కోలాహలంతో పాదయాత్ర చేస్తున్న ప్రాంతాలు సందడిగా మారాయి. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు ప్రజలు వినూత్నంగా మహా పాదయాత్రకు స్వాగతం పలికారు.

మండల టీడీపీ అధ్యక్షురాలు కేశినేని అనిత సారధ్యంలో పడవలతో రైతులకు ఘన స్వాగతం పలికారు. పడవలపై  ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఫోటోలను అలంకరించి వినూత్నంగా స్వాగతం పలకడం అందరిని ఆకర్షించింది.

స్థానిక ప్రజలు మాట్లాడుతూ ప్రజలు, రైతులు, వృద్దులు అందరూ పాదయాత్రకు ఘనస్వాగతం పలుకుతున్నారని, చాలా సంతోషంగా ఉందన్నారు. వినూత్నమైన పద్ధతిలో స్వాగతం పలకడం గొప్ప విషయంగా భావిస్తున్నామని అన్నారు. రాజధాని అభివృద్ధి జరగకుండా నిర్వీర్యం కావడానికి కారణం సీఎం జగన అన్నారు. ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రెండవ దఫా మహా పాదయాత్ర చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు.

రాష్ట్రంలో నియంతపాలన నడుస్తోందని విమర్శించారు. న్యాయస్తానాలే నేడు ఏపీ రాష్ట్రానికి భగవంతుల్లా కనబడుతున్నారని జేఏసీ నేతలు పేర్కొనడం గమనార్హం.