Site icon Prime9

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు సునాక్‌

Britain: బ్రిటన్‌ ఆర్థికమంత్రి రిషి సునాక్‌ రాజీనామాతో మొదలైన రాజీనామాల పర్వం  క్రమంగా పెరుగుతూపోయి 54 మంత్రుల రాజీనామా వరకు వెళ్లింది. దీతో బోరిస్‌ రాజీనామా అనివార్యమైంది. అయితే బోరిస్‌ స్థానంలో కొత్త ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ అప్పుడే మొదలైంది. కాగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ప్రధానమంత్రి రేసులో ముందున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా రిషిని బోరిస్‌ ఫిబ్రవరి 2020లోఆర్థికమంత్రిగా ఎంపిక చేసి తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. రిషినే ఫెవరేట్‌గా బుక్‌మేకర్‌, లాడ్‌బ్రోక్స్‌ అంచనా వేస్తోంది. రిషితో పాటు మాజీ డిఫెన్స్‌ సెక్రటరీ పెన్నీ మోర్‌డాంట్‌ కూడా రేసులో ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారస్తులకు, కార్మికుల కోసం పది బిలియన్‌ పౌండ్ల ప్యాకేజీ ప్రకటించడంతో ఆయన పేరు మార్మోగిపోయింది.

రిషి సునాక్‌ విషయానికి వస్తే కొన్ని మైనస్‌ పాయింట్లు కూడా ఉన్నాయి. వాటిలో సునాక్‌ భార్య ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి  పన్ను చెల్లింపు అంశంతో పాటు సునాక్‌ గ్రీన్‌ కార్డు విషయం గురించి బ్రిటన్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో పాటు ప్రతి అంశంపై త్వరగా స్పందించరనే అపవాద కూడా సునాక్‌ మూటకట్టుకున్నారు.

మద్యం ముట్టని సునాక్‌ కోవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి డౌన్‌స్ట్రీట్‌లో సమావేశంలో  పాల్గొన్నారని ఆయనపై ఫైన్‌ కూడా విధించారు. కాగా రిషి సునాక్‌ తాత పంజాబ్‌ నుంచి బ్రిటన్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కాలిఫోర్నియాలో చదువుకొనేటప్పుడు కలుసుకొని తర్వాత వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పీఎం రేసులో ముందున్నారు.

Exit mobile version