Site icon Prime9

IMDB : ఐఎండీబీ 2022లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరంటే ..?

imdb 2022 top indian actors list details

imdb 2022 top indian actors list details

IMDB : ఐఎండీబీ ( ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ) గురించి మూవీ లవర్స్ కి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు , టాక్ షో లు , ఇలా అన్నింటికీ వ్యువర్స్ ద్వారా నమోదైన అభిప్రాయాన్ని బట్టి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది ఈ సంస్థ. కాగా తాజాగా 2022 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ నటుల జాబితాను ప్రకటించింది. ఐఎండీబీ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్న నెలవారీ సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా ఈ జాబితాను నిర్ణయిస్తుంది. కాగా ఈ జాబితా ప్రకారం ది గ్రే మ్యాన్, తిరుచిత్రం బలం వంటి బహుభాషా చిత్రాలతో ఈ సంవత్సరంలో ధనుష్ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానాన్ని బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్, బ్రహ్మస్థ్ర చిత్రాలతో దేశ వ్యాప్తంగా క్రేజ్ పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఐఎండీబీ ప్రకారం 2022 లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమా నటునటులు

1. ధనుష్

2. అలియా భట్

3. ఐశ్వర్య రాయ్ బచ్చన్

4. రామ్ చరణ్ తేజ్

5. సమంత

6. హృతిక్ రోషన్

7. కియారా అద్వానీ

8. జూనియర్ ఎన్టీఆర్

9. అల్లు అర్జున్

10. యష్

కాగా ఈ సంధర్భంగా ఐఎండీబీ ఇండియా హెడ్ యామినీ పటోడియా మాట్లాడుతూ.. మా టాప్ 10 ప్రముఖ భారతీయ తారల జాబితా ప్రపంచ ప్రజాదరణను నిర్ణయించడానికి, కెరీర్ మైలురాళ్ళు, పురోగతి క్షణాలను గుర్తించడానికి బెంచ్‌మార్క్‌గా స్థిరపడింది అని తెలిపారు. వివిధ ప్రాంతాలలోని కళాకారులు ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభకు నిదర్శనం. ధనుష్ వంటి నటులు గుర్తింపు పొంది, ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్ వంటి హాలీవుడ్ తారలతో జతకడుతుండగా, మనం ఎన్. టి. రామారావు జూనియర్, రామ్ చరణ్ తేజ్ నటించిన ఆర్ఆర్ఆర్ వంటి గొప్ప చిత్రాలను చూడగలుగుతున్నాం అంటూ తెలిపారు. పొన్నియన్ సెల్వన్ చిత్రంతో ఐశ్వర్య రాయ్ బచ్చన్ సినిమాల్లోకి తిరిగి రావడం విమర్శకులు, అభిమానుల నుండి విస్తృతమైన ప్రశంసలను అందుకుందన్నారు.

అలానే మన తెలుగు ఇండస్ట్రి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 4 వ స్థానాన్ని దక్కించుకోగా… సమంత 5 వ స్థానంలో నిలిచింది. ఇక జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ … వరుసగా 8,9 స్థానాల్లో ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ” ఆర్ఆర్ఆర్ ” చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. కేవలం మన దేశంలోనే కాకుండా జపాన్ , యూఎస్ లలో కూడా ఈ మూవీ దూసుకుపోతుంది. అలానే సామ్ కూడా వరుస సినిమాల్లో నటిస్తూ హాలీవుడ్ లో కూడా ఒక సినిమాకి కమిట్ అవ్వడంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారారు. దీంతో వీరి అభిమనులంతా సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్ లు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Exit mobile version