iifa 2023 awards: బాలీవుడ్ సినీ తారల అందాలు, అదిరే ప్రదర్శనల నడుమ ఐఫా 2023 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఇక ఈ ఏడాదికి గాను.. ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారంటే?
బాలీవుడ్ సినీ తారల అందాలు, అదిరే ప్రదర్శనల నడుమ ఐఫా 2023 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఇక ఈ ఏడాదికి గాను.. ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారంటే?
ఇక ఈ ఏడాదికి ఉత్తమ నటుడిగా హృతిక్ రోషన్ అవార్డును సొంతం చేసుకున్నాడు. విక్రమ్ వేద సినిమాకు గాను ఈ అవార్డు లభించింది. గంగూబాయి కాథియవాడి చిత్రంలో నటనకు గానూ అలియాభట్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం2’ (హిందీ) ఉత్తమ చిత్రంగా నిలిచింది. అత్యధిక అవార్డులను ‘బ్రహ్మాస్త్ర: పార్ట్-1’, గంగూబాయి కాథియావాడి చిత్రాలు దక్కించుకున్నాయి.
ఐఫా 2023 అవార్డుల విజేతలు వీళ్లే
ఉత్తమ నటుడు: హృతిక్ రోషన్ (విక్రమ్ వేద)
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి)
ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (జగ్‌జగ్ జీయో)
ఉత్తమ సహాయనటి: మౌనీ రాయ్(బ్రహ్మాస్త్ర: పార్ట్-1)
ఉత్తమ దర్శకుడు: ఆర్.మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)
ఉత్తమ చిత్రం: దృశ్యం2
ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: పార్ట్-1)
ఉత్తమ గీత రచయిత: అమిత్ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర: పార్ట్-1)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: గంగూబాయి కాఠియావాడి
ఉత్తమ స్క్రీన్‌ప్లే : గంగూబాయి కాఠియావాడి
ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి
ఉత్తమ కొరియోగ్రఫీ: భూల్ భూలయా2
ఉత్తమ సౌండ్ డిజైన్: భూల్ భూలయా 2
ఉత్తమ ఎడిటింగ్: దృశ్యం2
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : బ్రహ్మాస్త్ర: పార్ట్-1
ఉత్తమ నేపథ్య సంగీతం: విక్రమ్ వేద
ఉత్తమ సౌండ్ మిక్సింగ్: మోనికా ఓ మై డార్లింగ్
ఉత్తమ తొలి చిత్ర నటుడు: శంతను మహేశ్వరి (గంగూబాయి కాఠియావాడి), బబ్లీ ఖాన్(ఖులా)(ఇద్దరి మధ్య టై అయింది)
ఉత్తమ తొలి చిత్ర నటి: కుషాలీ కుమార్ (దోఖా: రౌండ్ డి కార్నర్)