Himachal Pradesh: ఊహించిన్నట్లుగానే హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 12న ఎన్నికల జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొనింది.
రాష్ట్రంలోని 68 శాసనసభ స్థానాలకు ఒకే రోజు పోలింగ్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. హిమాచల ప్రదేశ్ లో ఇప్పటివరకు రెండు సార్లు ఏ పార్టీ అధికారంలో ఉన్నట్లు చరిత్ర లేదు. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది.
ఈ నెల 17 నుండి అభ్యర్ధులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చని ప్రకటించారు. చివరి తేదీ 25కాగ, నామినేషన్ల ఉప సంహరణ చివరి తేది 29గా నిర్ణయించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 55లక్షలు, ఇందులో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకొనున్న వారి సంఖ్య 1.86లక్షలని, 80 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య 1.22 లక్షలుగా ఉన్నట్లు తెలిపారు.
ఎన్నికలకు సంబంధించిన బూటకపు వార్తలు, వదంతులపై నిఘా పెట్టేందుకు సామాజిక మాధ్యమాల బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 80 ఏళ్ళ వయసు పైబడినవారు, అదేవిధంగా 40 శాతం పైబడిన అంగవైకల్యంగలవారు తమ ఇంటి వద్ద నుంచే ఓటు వేయవచ్చునని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే ఎన్నికల వేడి ప్రారంభమైంది. రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించారు, శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్‌పై పదునైన విమర్శలు కూడా గుప్పించారు.
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయిలో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని అన్ని శాసన సభ స్థానాల నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో అమలు చేస్తున్న పథకాలను హిమాచల్ ప్రజలకు వివరించేందుకు ఆప్ శ్రేణులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: కాగడాతో అన్యాయాన్ని, మోసాన్ని తగలబెడుతాం.. మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరే