Site icon Prime9

Maharashtra: భారీవర్షాలు.. మహారాష్ట్రలోని 800,000 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు

Maharashtra: మహారాష్ట్రలో ఈ నెలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 800,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 2022 జూలై 11 మరియు 12 తేదీల్లో కురిసిన భారీ వర్షాల వల్ల 24 జిల్లాల్లోని రైతులు ఎక్కువగా మరాఠ్వాడ మరియు విదర్భ ప్రాంతాలలో నష్టపోయారు. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, మరియు అరటి పంటలు మరియు ఇతర కూరగాయలు భారీగా దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది.

పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలోని పూణే, నాసిక్‌లతో పాటు విదర్భ ప్రాంతంలోని అకోలా, అమరావతి, యావత్మాల్, వార్ధా, నాగ్‌పూర్, భండారా, గడ్చిరోలి, చంద్రపూర్‌లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి.వరి, పత్తి, సోయాబీన్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వేరుశనగ, చెరకు, పసుపు మరియు జొన్న పంటలు కూడా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు. ఎనిమిది జిల్లాల్లో 522 జంతువులు. విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా 40 మంది వ్యక్తులు మరణించారు.

భారత వాతావరణ విభాగం (IMD) అంచనాల ప్రకారం, మరఠ్వాడాలోని ఔరంగాబాద్‌లో 326 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం కంటే ఇది 104 మి.మీ ఎక్కువ.

Exit mobile version
Skip to toolbar