Site icon Prime9

Rain Alert: కోస్తాంధ్రాకు భారీ వర్షాలు..హెచ్చరించిన వాతారవరణ శాఖ

rain alert to costal Andhra

rain alert to costal Andhra

Rain Alert: వర్షాలు తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. శీతాకాలం వస్తున్నా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ భారీ వానల ధాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాగా కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయని వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

అలాగే చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని కూడా తెలిపింది.

ఇదీ చదవండి: పెళ్లింట విషాదం.. లోయలో పడి 25 మంది మృతి

Exit mobile version