Governor Tamilisai: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్(BRS meeting) భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ విపక్ష నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు బీజేపీపై పలు విమర్శలు చేశారు. అదేవిధంగా బీజేపీ చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై(Governor Tamilisai ) సౌందరరాజన్ గవర్నర్ వ్యవస్థలపై సీఎంలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అదే విధంగా సీఎం కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ అంటే ప్రభుత్వానికి చిన్నచూపు
‘ తెలంగాణలో గవర్నర్ అంటే ప్రభుత్వానికి చిన్నచూపు.. గవర్నర్ కు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ పాటించరు. రాజ్యాంగపదవిలో ఉండి రాజకీయాలు మాట్లడను.
మిగలిన రాష్ట్రాల గురించి నాకు తెలియదు కానీ తెలంగాణ సర్కార్ ప్రోటోకాల్ పాటించడం లేదో చెప్పాలి.
ప్రోటోకాల్ పాటించకపోవడమంటే అహంకారం కాక మరేంటి. రిపబ్లిక్ డే అంశంపై నాకు సమాచారం లేదు.
నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి. అప్పుడు మాత్రమే రాజ్యాంగ వ్యవస్థపై మాట్లాడాలి.
నేను 25 ఏళ్లుగా రాజకీయాల్లోఉన్నాను. నాకు ప్రోటో కాల్ తెలుసు. నేను ఇండిపెండెంట్ గా పని చేస్తున్నా.. నా పై ఎవరి ఒత్తిడి లేదు.
గవర్నర్ వ్యవస్థ ఎలా హేళన చేస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ ను అవమానించారు’ అంటూ తమిళసై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎంలు మాట్లాడుతూ బీజేపీ పై పలు విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలన్నారు.
ఫెడరల్ స్తూర్తికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. కార్పొరేట్లకు నరేంద్ర మోదీ తొత్తుగా మారారని.. రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తోందన్నారు.
కులాలు, మతాల వారీగా ప్రజలను వేరు చేయడాన్ని వ్యతిరేకించాలన్నారు. మరోవైపు దేశంలో గవర్నర్ కార్యాలయాలు బీజేపీ ఆఫీసులుగా మారాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీం కోర్టులనే నేరుగా బెదిరించే స్థాయికి బీజేపీ(BJP) మంత్రులు చేరారని తెలిపారు.
వరుసగా రెండు సార్లు అవకాశమిచ్చినా బీజేపీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, ప్రజల ఆరోగ్యం, విద్య గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని 2024లో ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
గవర్నర్ల వ్యవస్థపై బీఆర్ఎస్ ఖమ్మం బహిరంగ సభలో సీఎంలు చేసిన వ్యాఖ్యలకు తమిళిసై కౌంటర్ ఇవ్వడంపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/