Site icon Prime9

AP Government : ఇకపై ఏపీలో రోడ్ షో లు బంద్… వైసీపీ సర్కారు ప్లాన్ అదేనా ?

government ban on road shows and rallys in andhra pradesh

government ban on road shows and rallys in andhra pradesh

AP Government : వైకాపా సర్కారు తాజాగా ఓ సంచలన నిర్ణయానికి తెర లేపింది. ఇకపై ఏపీలో రోడ్‌ షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ షో లు, ర్యాలీలు నిర్వహించేందుకు… ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని ఏపీ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్టేట్‌, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని సూచించింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు జరపాలని సూచించింది.

అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే షరతులతో కూడిన అనుమతి ఇవ్వనున్నట్లుగా వెల్లడించింది. షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది. కందుకూరు, గుంటూరు ఘటనల ప్రజలు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ హోం శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేసేందుకు వైసీపీ కుట్రలో భాగం గానే ఈ నిర్ణయం తీసుకుందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహితో బస్సు యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారాహిపై పెద్ద రచ్చే జరిగింది. మరోవైపు నారా లోకేష్ కూడా పాదయాత్రకు సిద్దమవుతున్నారు. ఈ తరుణంలోనే ఆయా ఘటనలను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం కావాలనే ఈ నిర్ణయాన్ని తీసుకుందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో పవన్ బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్ర లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version