Site icon Prime9

Ghulam Nabi Azad: జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ లో తిరుగుబాటు.. పార్టీ పదవికి గులాంనబీ అజాద్ రాజీనామా

New Delhi: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ జమ్మూ మరియు కాశ్మీర్ కమిటీ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు. తనకు ఈ పదవికి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆజాద్ చెప్పినప్పటికీ, అది తన స్దాయికి తగదని భావించి రాజీనామా చేసినట్లు సమాచారం.

గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన వెంటనే మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్ కమిటీ నుంచి వైదొలిగిన వారిలో ఆజాద్ సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే గుల్జార్ అహ్మద్ వానీ ఒకరు. తన రాజీనామాను సమర్పిస్తూ, గుల్జార్ అహ్మద్ వానీ ఇలా రాసాడు. జమ్ముకశ్మీర్ పిసిసి చీఫ్‌ పై నిర్ణయం తీసుకునే ముందు సీనియర్ నాయకులను సంప్రదించనందున మేము అసంతృప్తిగా ఉన్నాము. పీసీసీ చీఫ్ ఇటీవల చేసిన ప్రకటనలకు నిరసనగా పార్టీ సమన్వయ కమిటీకి రాజీనామా చేశాం. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను.

గులాంనబీ అజాద్ గతంలో జమ్ము కశ్మీర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా పలు శాఖలను కూడా నిర్వహించారు. పార్టీ పదవికి ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తిరుగుబాట్లను సూచిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

Exit mobile version