Site icon Prime9

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి మూడో పాట వచ్చేసింది – నానా హైరానా అంటూ ఆకట్టుకుంటున్న పాట

Game Changer Naana Hyraanaa Song Out: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’. డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో టాలీవుడ్‌ అగ్ర నిర్మాత ‘దిల్‌’ రాజు నిర్మించారు. 2025 జనవరి 10న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ మూవీపై హైప్‌ పెంచుతుంది.

ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే థర్డ్‌ సింగిల్‌ పేరుతో మూడో పాటను రిలీజ్‌ చేస్తుంది మూవీ టీం. గత కొద్ది రోజులుగా ఈ పాట రిలీజ్‌పై తెగ హడావుడి చేస్తుంది. ఇప్పటికే చిన్న ప్రొమో విడుదల కాగా దానికి సోషల్‌ మీడియా విపరీతమైన రెస్పాన్స్‌ వస్తుంది. నానా హైరానా అంటూ మెలోడిగా సాగే ఈ పాటకు అదిరిపోయిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ పాటను సాయంత్రం 6 గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్టు అప్‌డేట్‌ ఇస్తూ పాటలో స్టిల్స్‌ రిలీజ్‌ చేసింది టీం. వీటిని నెటిజన్లు ‘జగదేవక వీరుడు అతిలోక సుందరి’ మూవీతో పోల్చుతూ పాటను ట్రెండ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న నానా హైరానా ఫుల్‌ సాంగ్‌ను ఈ రోజు మూవీ టీం రిలీజ్‌ చేసింది. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటకు తమన్‌ సంగీతం అందించారు. స్టార్‌ సింగర్స్‌ శ్రేయా ఘోషల్‌, కార్తీక్‌లు పాడిన ఈ పాట మెలోడియస్ సాగుతూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నానా హైరానా పాట యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్‌ అందుకుంది. ఈ పాటతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ పాటకు బాస్కో మార్టిన్‌ కోరియోగ్రఫీ అందించారు. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా గేమ్‌ ఛేంజర్‌ మూవీ తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌ విడుదల కానుంది.

Exit mobile version