Site icon Prime9

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! – చరణ్‌తో లెన్తీ మోనోడైలాగ్‌ చెప్పించిన శంకర్‌..

Ram Charan Game Changer Update: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నారు. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బజ్‌ నెలకొంది. పైగా ఆర్ఆర్ఆర్‌ మూవీ తర్వాత రామ్‌ చరణ్‌ నుంచి వస్తున్న చిత్రమిదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లో అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఇటీవల విడుదలైన మూడో సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇలా వరుస అప్‌డేట్స్‌తో హైప్‌ పెంచుతున్నారు.

ఈ క్రమంలో గేమ్‌ ఛేంజర్‌ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో చరణ్‌ రోల్ పవర్ఫుల్‌గా ఉండనుందట. సినిమాలో ఓ సీన్‌లో చరణ్‌తో శంకర్‌ లెన్తీ మోనోడైలాగ్ చెప్పించడట. ఈ సీన్‌ సినిమాలోని హైలేట్‌ సీన్స్‌లో ఒకటని అంటున్నారు. ఈసీన్‌ రాగానే అంతా స్క్రీన్‌పై అతుక్కపోతారని, ఇందులో ఒక్కొడైలాగ్‌ ఆడియన్స్‌కి గూస్‌బంప్స్‌ తెప్పించడం పక్కా అంటున్నారు. ఇక ఈ సీన్‌లో చరణ్‌ పర్ఫామెన్స్‌ నెక్ట్‌ లెవల్‌ అని, అతడి డైలాగ్‌ డెలివరికి ప్రతి ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతారని ఇండస్ట్రీవర్గాలు అంటున్నాయి.

కాగా డైరెక్టర్‌ శంకర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతడి సినిమాలకు ప్రత్యేకమైన మార్క్‌ను క్రియేట్‌ చేస్తాయి. సామాజిక అంశాలకు తనదైన శైలిలో కమర్షియల్‌ యాక్షన్ జోడించి స్క్రీన్‌పై వండర్‌ క్రియేట్‌ చేస్తాడు. అలాంటి శంకర్‌ గేమ్‌ ఛేంజర్‌లో రామ్‌ చరణ్‌ రోల్‌ చాలా పవర్ఫుల్‌గా తీర్చిదిద్దాడు. గేమ్‌ చేంజర్‌లో మరోసారి తన మార్క్‌ చూపించబోతున్నాడ శంకర్‌. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ సెట్ నుంచి లీక్‌ అయిన ఫోటోలు, వీడియోల్లో చరణ్‌ లుక్‌ బాగా ఆకట్టుకుంటుంది.

కాగా పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ఎన్నికల అధికారికి కనిపించనున్నాడని సమాచారం. ఇందులో చరణ్‌ తండ్రికొడుకులుగా డ్యుయెల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. బాలీవుడ్‌ బ్యూటి కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నటి అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. శ్రీకాంత్‌, సముద్రఖని, సునీల్‌తో పాటు తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version