Site icon Prime9

Navjeevan Express Fire Accident: నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, తప్పిన పెను ప్రమాదం

fire-breaks-out-in-navajeevan-express-train-in-gudur

Gudur Junction: అహ్మదాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గూడూరు జంక్షన్‌ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం ప్రకారం అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది గూడూరు రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదం కారణంగా రైలు గూడూరు రైల్వేస్టేషన్‌లో గంటసేపు ఆగి చెన్నైకి బయలుదేరింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.

Exit mobile version