Fire Accident Secunderabad: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేటలో ఈ ప్రమాదం సంభవించింది.
డెక్కన్ నైట్ వేర్ కార్ల విడి భాగాల షాప్ లో మంటలు చెలరేగాయి.
దీంతో ఒక్కసారిగా మంటలు దుకాణం అంతటా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
తప్పిన భారీ ప్రమాదం..
మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నాయి.
ఈ ప్రమాదం జరిగిన దుకాణంలో ఆరు అంతస్థులను కలిగి ఉంది.
మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
ఈ ప్రమాదం సుమారు పదిన్నర సమయంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు.
బిల్డింగ్‌లోని ఒక ఫ్లోర్‌లో బట్టలు దుకాణం ఉన్నట్లు తెలుస్తుంది.
దట్టమైన పొగ ఉండటంతో.. అగ్నిమాపక సిబ్బందికి అంతరాయం ఏర్పడుతుంది.
పొగ ఎక్కువగా వ్యాపించడంతో బిల్డింగ్ లో ఉన్నవారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తుంది.
ప్రస్తుతం నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు.
బిల్డింగ్ లోని ప్రజలు అంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
షాపింగ్ మాల్ లో ప్రమాదం జరిగినట్లు తెలిపిన పోలీసులు.
సురక్షితంగా నలుగురు
ఈ ఘటనలో ఎవరి ప్రమాదం జరగలేదని.. స్థానికులు అంటున్నారు.
సకాలంలో స్పందించిన సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాల కోసం విచారణ చేస్తున్న పోలీసులు.
షార్ట్ సర్క్యుట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ.
కావాలనే మంటలు అంటించారా అనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.
భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/