Enforcement Directorate: భారత జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలను ప్రచారానికి రాకుండా అడ్డుకొనేందుకు భాజపా ఎత్తుగడలను వేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇస్తుందన్నారు. రాహుల్ పాదయాత్రతో వస్తున్న ప్రజాధరణను అడ్డుకొనేందుకు భాజపా వేసిన ఎత్తుగా ఆయన పేర్కొన్నారు.
మనీలాండరింగ్ పేరుతో నేతలను ఇబ్బందులకు గురిచేయాడంతోపాటు వారిని తమ పార్టీలోకి చేర్చుకొనేందుకు భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు. ఈడీని ఉసిగొల్పి పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో కీలక నేతలు రాహుల్ వెంట లేకుండా ఉండేలా భాజపా కుట్ర చేస్తుందన్నారు. ఎన్ఫోర్స్ముంట్ డైరెక్టరేట్ ని ఎలక్షన్ డిపార్టుమెంటుగా భాజపా మార్చిందని ఆయన దుయ్యబట్టారు.
అటు కర్ణాటక, ఇటు తెలంగాణాలోని పలువురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతో వస్తున్న ప్రజాధరణతో కేంద్ర రాహుల్ పాదయాత్రను అడ్డుకొనేందుకు నానా తంటాలు పడుతుంది.
ఇతి కూడా చదవండి: Revanth Reddy: భారత్ జోడో యాత్ర.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే.. రేవంత్