Site icon Prime9

Dr. BR Ambedkar : ఆకాశమంత “అంబేద్కర్”.. హైదరాబాద్ లో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

Dr. BR Ambedkar 125 feet statue going to inaguarated by cm kcr

Dr. BR Ambedkar 125 feet statue going to inaguarated by cm kcr

Dr. BR Ambedkar : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132 వ జయంతిని పురస్కరించుకొని నేడు హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్  ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ సమీపాన ఎన్టీఆర్ గార్డెన్ కు ఆనుకుని ఉన్న స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది కావడం విశేషం. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఉంచారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలానే బీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది. ఇంకా ఆ విగ్రహం ప్రత్యేకతలు, ఆవిష్కరణ ఏర్పాట్ల గురించి ఈ వీడియోలో మీకోసం ప్రత్యేకంగా..

 

Exit mobile version