Director K Viswanath : ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లు అయ్యింది. కె.విశ్వనాథ్ ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది సినీ పరిశ్రమ.
ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. పలువురు ప్రముఖులు కె విశ్వనాథ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
గుంటూరు జిల్లా రేపల్లెలో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని విశ్వనాథ్ జన్మించారు.
గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు.
విశ్వనాథ్ తండ్రి చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో పనిచేసేవారు.
దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తికాగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించారు.
(Director K Viswanath) దర్శకుడిగా..
పాతాళభైరవి సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు
1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కె.విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు.. విశ్వనాథ్ 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం, ఆపద్భాందవుడు వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.
బాలీవుడ్‌లో 9 సినిమాలకు దర్శకత్వం వహించారు.
చివరిగా అల్లరి నరేష్ హీరోగా శుభ సంకల్పం సినిమా తెరకెక్కించారు.
(Director K Viswanath) అవార్డులు..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆణిముత్యాలు అనదగే సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం వంటి సినిమాలు ఆయన అందించినవే. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2016లో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. స్వాతిముత్యం 59వ ఆస్కార్ అవార్డుల బరిలోనూ నిలిచింది. ఆసియా ఫసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి, సాగరసంగమం, సిరివెన్నెల సినిమాలు ప్రదర్శించారు. మాస్కోలో జరిగిన చలనచిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమాను ప్రదర్శించారు. అలాగే స్వరాభిషేకం సినిమాకు ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం విశ్వనాథ్‌ను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది.
(Director K Viswanath) జాతీయ చలనచిత్ర పురస్కారాలు..
1980-జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం -శంకరాభరణం
1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం – సప్తపది
1984- జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు సాగరసంగమం
1986 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు – స్వాతిముత్యం
1988 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు శృతిలయలు
2004 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు స్వరాభిషేకం
నటుడిగా..
కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన ప్రతిభ చూపించారు. తాత, తండ్రి పాత్రల్లో అద్భుతంగా నటించారు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్.. వజ్రం, కలిసుందాం రా, నరసింహనాయుడు, సీమ సింహం, నువ్వు లేక నేను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు.
ఒక లెజెండరీ దర్శకుడు, కళామ్మ తల్లి ముద్దుబిడ్డలలో ఒకరైన విశ్వనాథ్ కి అందరూ నివాళులు అర్పిస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/