Gopichand Malineni : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం “వీర సింహారెడ్డి”. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తున్నారు. ఇక శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా… వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. దీంతో బాలయ్య అభిమనులతో పాటు సినీ ప్రేక్షకులంతా సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కాగా తాజాగా ఈ మూవీలోని మరో సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. “మాస్ మొగుడు” అనే సాంగ్ ని సోమవారం రాత్రి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ మాట్లాడుతూ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వాల్తేరు వీరయ్యతో పాటు బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా ఘన విజయం సాధించి మంచి కలెక్షన్స్ రావాలని కోరుకున్నారు. ఇందుకు గాను ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని దీనిపై స్పందించాడు.
థ్యాంక్స్ ఎందుకు చెప్పారంటే…
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ… వలేరు వీరయ్యతో పాటు మా సినిమా కూడా హిట్ కావాలని కోరుకున్న చిరంజీవి గారికి ధన్యవాదాలు. మా యూనిట్ అందరి తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రెండ్ సినిమాలు హిట్ అవ్వాలి, మైత్రీ మూవీ మేకర్స్ కి మంచిగా డబ్బులు రావాలి. తెలుగు సినిమాలు అన్నీ హిట్ అవ్వాలి అని తెలిపారు. అదే విధంగా ఒంగోలులో జరిగిన ఈవెంట్ లో అక్కడ పోలీసులు కొంతమంది అభిమానుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని తెలిసింది. ఇందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను అని అన్నారు. ప్రస్తుతం గోపీచంద్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి…
Jasprit Bumrah: టీమ్ ఇండియాకు భారీ షాక్! శ్రీలంకతో వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం
Hanuman: పదకొండు భాషల్లో హనుమాన్ మూవీ.. సమ్మర్‌లో సందడే ఇక
Samantha: ఓపిక లేకపోయినా వచ్చాను.. కన్నీరు పెట్టుకున్న సమంత
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/