Site icon Prime9

Dhoni: మహేశ్ బాబుతో ధోని సినిమా..!

mahesh act in dhoni production

mahesh act in dhoni production

Dhoni: మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు వినని వారుండరు. భారత క్రికెట్‌ జట్టు సారధిగా అనేక రికార్డులు సృష్టించారు. కాగా ధోని తాజాగా నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దక్షిణాది హీరో,హీరోయిన్లతోనూ సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఇప్పటికే ‘రోర్‌ ఆఫ్‌ లయన్‌’,‘ద హిడెన్‌ హిందూ’, ‘బ్లేజ్‌ టు గ్లోరీ’ అనే మూడు షార్ట్ ఫిలింస్ ను రూపొందించారు. ఈ చిత్రాలకు ధోనీ, ఆయన సతీమణి సాక్షి నిర్మాణ బాధ్యతలు వహించారు. ఇకపై ధోని భారీ స్థాయిలో సౌత్‌ స్టార్స్‌తో సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. దీనిలో భాగంగా తమిళ స్టార్ హీరో విజయ్‌తో ధోనీ ఓ చిత్రానికి అంగీకారం కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే కన్నడ హీరోలతోనూ సినిమా చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ధోనీ నిర్మాణంలో నటిస్తారనే ప్రచారం జరుగుతున్నది. మరి దీనిపై ధోని స్పందిచాల్సి ఉంది. కాగా మహేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి కాంబినేషన్‌లో మరో సినిమాలో నటించనున్నారు.

ఇదీ చదవండి: అల్లుఅర్జున్ కు మరో అరుదైన అవార్డ్.. తొలి సౌత్ హీరోగా రికార్డ్

Exit mobile version