Site icon Prime9

G20 Summit 2023 : విశాఖ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన జీ–20 సదస్సు..

details about g20 summit 2023 started in vizag and cm jagan going to attend

details about g20 summit 2023 started in vizag and cm jagan going to attend

G20 Summit 2023 : ఏపీ లోని విశాఖపట్నం వేదికగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సదస్సు ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఈ మేరకు విశాఖ సిటీని ముస్తాబు చేసిన అధికారులు.. మరోవైపు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ నెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను (జీఐఎస్‌) ఘనంగా నిర్వహిం అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ సర్కార్‌.. ఇక, నేటి నుంచి జీ–20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది.

ఈ సదస్సు వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్‌ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.. ఇప్పటికే ప్రతినిధుల విశాఖకు చేరుకున్నారు. జీ–20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, జీ–20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ సభ్యులుగా ఉన్నాయి.

 

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరుకొని జీ20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం విదేశీప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించే అవకాశం ఉంది.

జీ 20 సదస్సు షెడ్యూల్‌ (G20 Summit 2023)..

28 వ తేదీ..  

ఉదయం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో అల్పాహారం తర్వాత ప్రధాన సమావేశం హోటల్‌లోని కన్వెన్షన్‌ హాలులో జరుగుతుంది.

సా.3.30 నుంచి 6.30 వరకు మూడు రకాల సమావేశాలు నిర్వహిస్తారు.

రాత్రి 7.30 నుంచి 9.30 వరకు హోటల్‌ సమీపంలోని బీచ్‌లో గాలా డిన్నర్‌ ఉంటుంది. దీనికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరవుతారు.

29వ తేదీ.. 

బీచ్‌లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటా­యి. ఆ రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం జరగనుంది.

30 వ తేదీ.. 

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌ షాపు నిర్వహిస్తారు. ఆ తర్వాత ముడసర్లోవ, కాపులుప్పాడ ప్రాంతాల్లో ప్రతినిధులు పర్యటిస్తారు. స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్, మెగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ పనితీరు, జిందాల్‌ కంపెనీ పరిధిలో నిర్వహించే వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎనర్జీ తయారీ యూనిట్‌ పనితీరు గురించి అధికారులు వివరిస్తారు.

31వ తేదీ.. 

దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ కమిషనర్లతో పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సింగపూర్, దక్షిణ కొరియా ప్రతినిధులతో చర్చిస్తారు. జన్‌భాగీదారీ కార్యక్రమం కింద స్థానిక నిపుణులతో వివిధ అంశాలపై చర్చా సమావేశాలు జరుగుతాయి.

Exit mobile version
Skip to toolbar