Site icon Prime9

Deepika Padukune : ప్రాజెక్ట్ K నుంచి దీపికా పదుకునేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన టీమ్

deepika padukune poster released from prabhas project k movie

deepika padukune poster released from prabhas project k movie

Deepika Padukune : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-K’. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గానటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వని దత్ ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాలోని ఒక వెహికల్ కోసం భారీ చక్రాన్ని తయారు చేస్తున్న వీడియోని ఇటీవల రిలీజ్ చేశారు.

ఇప్పుడు తాజాగా దీపిక పదుకునేకి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది మూవీ టీమ్. నేడు దీపికా పుట్టినరోజు కావడంతో ప్రాజెక్ట్-K టీం ఆమెకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ మేయరకు సోషల్ మీడియా వేదికగా దీపిక క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. కానీ పేస్ మాత్రం కనబడకుండా పోస్టర్ ని డిజైన్ చేశారు. అలాగే పోస్టర్ మీద ‘చీకటిలో ఆమె ఒక ఆశ’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ తో దీపికా అభిమనులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

గతంలో ప్రభాస్, అమితాబ్ పుట్టిన రోజుల సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటో లాగా కాకుండా… ఫుల్ లుక్ రివీల్ చేయడం పట్ల ఆమె ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. వైజయంతీ బ్యానర్స్ పై 100 వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా ఉండనుందని నాగ్ అశ్విన్ చెబుతున్నారు. మరోవైపు షారూఖ్ ఖాన్ కి జోడీగా దీపికా నటించిన “పఠాన్” త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి తీవ్ర స్థాయిలో వివాదాలు వస్తున్న తరుణంలో మూవీ రిలీజ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీపికకు పుట్టిన రోజు విషెస్ చెబుతూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ని వైరల్ గా మారుస్తున్నారు.

 

Exit mobile version