Site icon Prime9

Skanda Movie : “స్కంద” మూవీ నుంచి “కల్ట్ మామ” సాంగ్ రిలీజ్.. స్టెప్పులు అదరగొట్టిన అదరగొట్టిన రామ్, ఊర్వశి రౌతేలా

cult mama song released from ram pothineni skanda movie

cult mama song released from ram pothineni skanda movie

Skanda Movie : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం “స్కంద”. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ఊరమాస్ అవతార్ లో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని (Skanda Movie) జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా మంచి సక్సెస్ కొట్టాలని అంతా భావిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోగా.. సాంగ్స్ కూడా అందర్నీ అలరిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి “కల్ట్ మామ” అనే స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ “ఊర్వశి రౌతేలా”.. రామ్ తో కలిసి స్టెప్పులేసింది. పక్కా మాస్ బీట్ తో వచ్చిన ఈ సాంగ్ లో రామ్, ఊర్వశి అదిరిపోయే డాన్స్ తో నెక్స్ట్ లెవెల్ లో అదరగొట్టారు. ఈ గీతాన్ని హేమచంద్ర, రమ్య బెహరా, మహా ఆలపించారు. అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించారు.

 

ఇక ఇప్పటికే ఊర్వశి.. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’, అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో అదరగొట్టింది. ఈ సాంగ్ కూడా మంచి హిట్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 28న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Exit mobile version