Site icon Prime9

CPI Narayana: చిరంజీవిపై కామెంట్లను వెనక్కితీసుకుంటున్నాను.. సీపీఐ నారాయణ

Andhra Pradesh: మెగాస్టార్ చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీపీఐ నారాయణ కామెంట్ల పై నాగబాబు ట్విట్టర్ లో విమర్శించడంతో, అది మరికాస్త పెరిగింది. దాంతో చిరంజీవిపై చేసిన కామెంట్లపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఆయన పై చేసిన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకుంటున్నానని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం భాషా దోషం వల్ల మాత్రమే జరిగాయని చెప్పుకొచ్చారు. చిరంజీవి తండ్రితో తనకు చాలా అనుబంధం ఉందని చిరంజీవిపై చేసిన కామెంట్లకు చింతిస్తున్నానని అన్నారు. మెగా అభిమానులు, కాపునాడు పెద్దలు ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు.

Exit mobile version