Site icon Prime9

Ysrcp MLA : 87 కోట్ల విలువైన ఆస్తులను 11 కోట్లకే కొట్టేసిన వైసీపీ ఎమ్మెల్యే.. సోషల్ మీడియాలో వైరల్ గా స్టోరీ.. అసలు నిజం ఏంటి?

controvercial news spreading on social media about ysrcp mla brahma naidu

controvercial news spreading on social media about ysrcp mla brahma naidu

Ysrcp MLA : ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా ఎమ్మెల్యే.. ఒక బ్యాంక్ మేనేజర్ తో కుమ్మక్కై 87 కోట్ల విలువైన ఆస్తుల్ని వేలంపాటలే బిడ్డర్లను భయపెట్టి 11 కోట్లకే సొంతం చేసుకున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది.

అయితే ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా వైకాపా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. విజయవాడ కెనరా బ్యాంకు ఏజీఎం విజయరామరాజుతో కుమ్మక్కై పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం సాతులూరులో గల అమరా ఇంజినీరింగ్ కళాశాల భవనాలను చౌకగా దక్కించుకున్నారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

బ్యాంకు అధికారులు అన్యాయం చేశారని ఆరోపిస్తూ కళాశాల చైర్మన్ అమరా వెంకటేశ్వరరావు సోమ వారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయ త్నించి, మంగళవారం మృతి చెందడంతో ఈ ఉదంతం కలకలం సృష్టిస్తోంది.

రూ.87 కోట్ల విలువైన ఆయన ఆస్తిని వేలంలో బిడ్డర్లను భయపెట్టి రూ.11 కోట్లకే సొంతం చేసుకున్నారని, మృతుని కుటుంబ సభ్యులతో వైకాపా నేతలు బేరసారాలు సాగిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

అది నిజం కాదు : రావెల సత్యనారాయణ

ఈ కళాశాల భవనాలను ఎమ్మెల్యే బ్రహ్మనా యుడు దక్కించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తిరుమల ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి రావెల సత్యనారాయణ తెలిపారు.

తాము జనవరి 16న వేలంలో వెంకటరమణ ఛారిటబుల్ ట్రస్టు తరపున పాల్గొన్నామని, బ్రహ్మనాయుడుతో పాటు దండా బ్రహ్మానందం, బత్తిన నాగేశ్వరరావు, డాక్టర్ నలబోతు వెంకట్రావు అందులో భాగస్వాము లని చెప్పారు.

కొన్నేళ్లుగా అమరా కళాశాల భవనా లను కెనరా బ్యాంకు అధికారులు వేలం వేస్తున్నా ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు.

కళాశాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము వేలంలో పాల్గొన్నామని వివరించారు. రూ.11.06 కోట్లకు రూ. 20 వేలు కలిపి బిడ్డు వేశామన్నారు.

అయితే రూ.87 కోట్ల విలువైన ఆస్తిని తక్కువకే దక్కించు కున్నామనే ప్రచారం నిజం కాదని చెప్పారు.

ఇప్ప టికైనా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు కోరితే తాము విరమించుకునేందుకు సిద్ధమని చెప్పారు.

వేలం సందర్భంగా కోర్టులో కేసులు వేసిన వెంకటే శ్వరరావు తమను సంప్రదించినా విరమించుకునేవారమని పేర్కొన్నారు.

వెంకటేశ్వరరావు ఆత్మహ త్యకు పాల్పడటం తమను కలిచివేసిందని

తెదేపా ఆరోపణలివి: ఎమ్మెల్యే గోపిరెడ్డి

అమరా వెంకటేశ్వరరావు మృతికి వైకాపా నేతలే కారణమంటూ తెదేపా నేతలు చేస్తున్న విమర్శలు అర్థర హితమని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు.

బ్యాంకు అధికారులు తమకు అన్యాయం చేశారని వెంకటేశ్వరరావు భార్య చెప్పినా ఇంకా తెదేపా నేతలు తమపై ఆరోపిస్తున్నారని ఆరోపించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version