New Delhi: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగం పై కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. శతాబ్దం క్రితం ఒక్కో ఇటుక పేర్చుకుంటూ భారత్‌ను నిర్మించుకుంటే ప్రస్తుతం మన కళ్ల ముందే ప్రజాస్వామ్యం నాశనంమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరకుశత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే అరెస్టు చేస్తున్నారు. జైలుకు పంపుతున్నారు. ఇష్ట వచ్చినట్లు కొడుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంటుకు వెళ్లడానికి ముందు నిరసనగా కాంగ్రెస్ ఎంపీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నల్లటి దుస్తులు ధరించారు. ప్రజాసమస్యలను గాలికి వదిలి ఈడీ ద్వారా తమపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని సభలో మండిపడ్డారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన జారీ చేసింది. లోకసభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు చలో రాష్ట్రపతి భవన్‌కు నిరసన ప్రదర్శన చేపడతామని, అలాగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు ప్రధాని ఇంటిని ముట్టడించాలని నిర్ణయించారు.