Site icon Prime9

Collector: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన కలెక్టర్

collector wife gave birth in govt hospital

collector wife gave birth in govt hospital

Collector: సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు ఉండవు అనే భ్రమలో చాలా మంది ఉంటారు. అయితే ఈ భ్రమ వట్టి అపోహ అని నిరూపించారు ఆ కలెక్టర్ దంపతులు. తన భార్య ప్రసవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించి అసలైన ప్రభుత్వ అధికారి అనిపించుకున్నారు కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఈ అరుదైన ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

సహజంగా ప్రభుత్వ అధికారులు వారికి అనారోగ్యం వస్తే ప్రైవేటు ఆసుపత్రులు వెళ్తుంటారు. అదే ప్రసవానికి అయితే పేరున్న గైనకాలజిస్టులను సంప్రదిస్తారు. అయితే  అందుకు భిన్నంగా తెలంగాణలోని ఓ కలెక్టర్ తన ప్రసవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో పురుడుపోసుకున్నారు.
సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు. కాగా ఆమెకు సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించారు. అయితే శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధారణ డెలివరీ చేయడం సాధ్యం కాలేకపోయిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య తెలిపారు.

ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్లు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్యలు ఆపరేషన్ చేసి త్రిపాఠికి డెలివరీ చేశారు. కాగా ఇలా త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. శిశువు 3.400కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించి జిల్లా ప్రజలకే కాక యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఈ కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు.

ఇదీ చదవండి: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన ఇద్దరు సీఐలు..!

Exit mobile version