CM Revanth Comments on Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరు సమానులే అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఆయన అరెస్ట్‌తో తనకు ఏం సంబంధం లేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనలో కేసులు చర్యలు తీసుకుంటున్నారని, చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా తాజాగా సినీ హీరో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి ప్రకటన, ముందస్తూ నోటీసులు లేకుండా పోలీసులు ఆయన ఇంటికి అల్లు అర్జున్‌ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాన్ ఇండియా స్టార్, నేషనల్ అవార్డు గ్రహిత అయిన అల్లు అర్జున్ అరెస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. సంధ్య థియేటర్ ఘటనపై తనపై నమోదైన కేసు కొట్టివేయాలని ఇప్పటికే అల్లు అర్జున్ కోర్టులో పటిషన్ వేశారు.
ఆయన పటిషన్ విచారణకు రాకముందే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో బన్నీ పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సిందే తాజాగా క్వాట్ పటిషన్‌ని వేశారు. దీనిపై సాయంత్ర 4 గంటలకు విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే బన్నీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం మేజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్‌ని హాజరుపరిచిన పోలీసుకలు మేజిస్ట్రేట్‌కు కేసుకు సంబంధించిన వివరాలను వివరిస్తున్నారు.