Site icon Prime9

Allu Arjun: అల్లు అర్జున్‌ థియేటర్ వద్ద హంగామా చేయకుండ ఉంటే.. ఆ ఘటన జరిగేది కాదు: సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy on Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అల్లు అర్జున్‌ ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదన్నారు. శుక్రవారం ‘ఆజ్‌తక్‌’ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌దత్‌ ఎందుకు అరెస్ట్‌ అయ్యారు. ఎందుకంటే ఈ దేశంలో సాధారణ పౌరుడి నుంచి పీఎం వరకు అందరూ డా. బీఆర్‌ అంబేద్కర్‌ రాసిని రాజ్యాంగం అందరికీ సమానం. పుష్ప 2 రిలీజ్‌కి ముందు టికెట్‌ రేట్స్‌, బెన్‌ఫిట్‌ షోలకు మేమే అనుమతి ఇచ్చాను. కానీ, థియేటర్‌కి అల్లు అర్జున్‌ ఎలాంటి ముందస్తు సమచారం లేకుండ వచ్చారు.

దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు పొటెత్తారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. ఆమె కుమారుడు ఇప్పుడ ప్రాణాప్రాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ పిల్లాడి జీవితం ఏంటీ? ఆయన ప్రాణాలకు ఎవరూ భరోసా? ఇస్తారు. అల్లు అర్జున్‌ సినిమా చూసి సైలెంట్‌గా వెళ్లిపోయి ఉంటే ఆ ఘటన చోటుచేసుకునేది కాదు. ర్యాలీగా వచ్చారు. అందుకే పోలీసులు ఆ ఘటనపై కేసు నమోదు చేసి థియేటర్‌ యాజమాన్యాన్ని అరెస్ట్‌ చేశారు. వారి అరెస్ట్‌ చేసిన 10 రోజులకు అల్లు అర్జున్‌ అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌ విధించి జైలుకు పంపారు. కాసేపటికే ఆయనకు బెయిల్‌ కూడా వచ్చింది. విడుదల కూడా అయ్యారు. కానీ కావాలనే సీఎం సినిమా స్టార్‌ అరెస్ట్‌ చేయించారు అని అంతా చర్చ మొదలుపెట్టారు. అతడు సినిమా స్టారా? పొలిటికల్‌ స్టారా? అని చూడరు. నేరం చేసింది ఎవరు? అనేదే చూస్తారు” అని సీఎం అన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. “అల్లు కేవలం సినిమా చూసి వెళ్లలేదు. కారులోనుంచి బయటకు వచ్చి అందరికి అభివాదం చేస్తూ ర్యాలీగా వెళ్లారు. సినిమా స్టార్‌ వచ్చారంటే ఖచ్చితంగా జనాలు అత్యుత్సాహం చూపిస్తారు. అందువల్లే అక్కడ అంత గొడవ జరిగింది. అక్కడ ఆయన ఎలాంటి హంగామా లేకుండా వచ్చి సినిమా చూసి ఉంటే ఈ ఘటన చోటుచేసుకునేది కాదు. దానివల్ల ఓ మహిళా ప్రాణాలు పోయాయి. దానికి ఎవరూ బాధ్యులు? చిన్న పిల్లాడు చావుబ్రతుకుల మధ్య ఉన్నాడు. అందుకు ఎవరూ బాధ్యత వహిస్తారు. అయినా కూడా ఈ కేసులో ఆయననను ఏ11 కింద కేసు నమోదు చేశాం. నిజానికి అల్లు అర్జున్‌ సినిమా చూడాలనుకుంటే ఆయన స్టూడియోలో స్పెషల్‌ షో వేసుకోవచ్చు. ఇంట్లోనే హోంథియేటర్స్‌ ఉంటున్నాయి. అందులో చూడోచ్చు. సరే అభిమానులు, ప్రేక్షకులతో కలిసి చూడాలనుకున్నప్పుడు ముందస్తు సమాచారం ఉండాలి. థియేటర్‌ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇస్తే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉండేవారు. అలా సడెన్‌గా వస్తే ఉన్న కొద్దిమంది సిబ్బందితో అక్కడ భద్రత చర్యలు ఎలా తీసుకుంటారు” అని ఆయన ప్రశ్నించారు.

“అల్లు అర్జున్‌ అరెస్ట్ చేయించినందుకు ఇంత చర్చ చేస్తున్నారు. కానీ ఈ ఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబ పరిస్థితి ఎలా ఏంటీ? తీవ్రంగా గాయపడిన ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు? అని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. అయినా హీరో అల్లు అర్జున్‌ను కావాలని అరెస్ట్‌ చేయించాల్సి అవసరం ఏముంటుంది. చట్ట ముందు అందరు సమానమే. పోలీసులు లా అండ్‌ అర్డర్‌ ప్రకారం నడుచుకుంటారు. అందుకే అరెస్ట్‌ చేశారు. నిజానికి అల్లు అర్జున్‌ మామయ్య మెగాస్టార్‌ చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థే. ఆయన సొంత మామ చంద్రశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నేత. వారు మాకు దగ్గరి బంధువులు కూడా. కానీ నేరం చేసిన వాళ్లు చట్టం ముందు అందరి సమానమే. అందుకు పోలీసులు తమ పని తాము చేశారు” అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version