CM KCR: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సోమవారం మరణించారు. కాగా నేడు ఆయన అంత్యక్రియలు జరుగునున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యూపీ మాజీ సీఎం మూలాయం సింగ్ యాదవ్ గురుగ్రాంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ధృవీకరించారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని మరియు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ములాయం మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ కు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇకపోతే ములాయం మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన యూపీ రాష్ట ప్రభుత్వం ఈ మూడురోజులను సంతాప దినాలుగా ప్రకటించింది.
ఇదీ చదవండి: ములాయంసింగ్ యాదవ్ ప్రధాని అయ్యే అవకాశాన్ని ఎలా కోల్పోయారో తెలుసా?