Site icon Prime9

Sankranthi 2023 : సంక్రాంతికి ఇద్దరూ హిట్ కొట్టారు.. వసూళ్లలో మాత్రం చిరంజీవిదే పైచేయి

chiranjeevi waltair veerayya beat veera simhareddy in sankranthi 2023 movies fight

chiranjeevi waltair veerayya beat veera simhareddy in sankranthi 2023 movies fight

Sankranthi 2023 : టాలీవుడ్ లో సంక్రాంతి 2023  ప్రేక్షకులకు మంచి మాస్ మీల్స్ ని అందించింది.

సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు.

అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు.

అందుకే ప్రతి సంక్రాంతికి సినిమా వాతావరం వేడెక్కుతూ ఉంటుంది.

కాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య”, నందమూరి బాలకృష్ణ “వీర సింహారెడ్డి” బరిలో నిలిచాయి.

చాలా గ్యాప్ తర్వాత ఈ బడా హీరోలు ఇద్దరు పోటీలో నిలిచారు.

చివరగా ఖైదీ 150, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలతో పోటీ పడ్డ ఈ హీరోలు ఈసారి కూడా గట్టి పోటీని ఇచ్చారు.

కాగా ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకొని అభిమానులకు ఊర మాస్ ట్రీట్ ఇచ్చారు.

100 కోట్లు కొట్టిన ఇద్దరు హీరోలు..

ఈ రెండు సినిమాలకు నిర్మాణ సంస్థ ఒకటే కావడంతో అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించి మంచి హిట్ లను ఖాతాల్లో వేసుకున్నారు.

థియేటర్స్ కౌంట్ నుంచి ఓపెనింగ్ డే, ఓవర్సీస్ కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇలా ప్రతి విషయంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల మధ్య పోటీ నడిచింది.

ఈ పోటీలో చిరు, బాలయ్యలలో ఎవరూ తగ్గకుండా ఆడియన్స్ కి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు.

అయితే చిరంజీవి సినిమా కంటే ఒకరోజు ముందుగానే (జనవరి 12న) వీర సింహా రెడ్డి సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు బాలకృష్ణ.

మాస్ అవతార్ లో మొదటి రోజే 50 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన వీర సింహా రెడ్డి సినిమా నాలుగు రోజుల్లోనే 104 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది.

ఇక మరోవైపు జనవరి 13 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజైన మొదటి రోజు రూ.55 కోట్లకుపైనే గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.

మెగాస్టార్‌ సినిమా రెండో రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ .75.50 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

ముచ్చటగా మూడో రోజుతో కలెక్షన్ల ఊచకోతను 100 కోట్లు దాటించి రికార్డులు తీరగరాసింది.

 

వీర సింహారెడ్డిని బీట్ చేసిన వాల్తేరు వీరయ్య..

చిరు వాల్తేరు వీరయ్య లోని రికార్డుల్లో నాపేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయనే డైలాగ్‌ను నూటికి నూరు శాతం వాస్తవం చేస్తూ దుమ్ము రేపుతోంది.

ఇక ఓవర్సీస్ రికార్డులు కొల్లగొడుతోంది వాల్తేరు వీరయ్య. ఇప్పటివరకు అమెరికాలో1.6 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్స్‌ను రాబట్టింది.

ప్రస్తుతమున్న జోరు చూస్తుంటే వాల్తేరు వీరయ్య సినిమా త్వరలోనే 150 కోట్ల గ్రాస్ ని రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించించారు మైత్రీ మూవీ మేకర్స్.

ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య మెగా మాస్ బ్లాక్ బస్టర్ అని పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

తొలి మూడు రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ రాబట్టి మెగాస్టార్ బాక్సాఫీస్ బాస్ అయ్యారని తెలిపారు.

ఏనుగుపై కూర్చొని ఉన్న చిరంజీవి కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక “వీర సింహారెడ్డి” ఫస్ట్ డే బాలయ్య కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ని రాబట్టినప్పటికి.. చిరు వాల్తేరు వీరయ్య ధాటికి రెండో రోజు నుంచి కలెక్షన్లు తగ్గాయి.

వీర సింహారెడ్డితో పోలిస్తే చిరు సినిమాకి ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతుండడంతో థియేటర్స్ కూడా ఎక్కువ చిరంజీవి సినిమాకే లభిస్తున్నాయి.

శృతి హాసన్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, ఊరమాస్ కంటెంట్ తో ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తోంది.

మాస్‌ మహారాజ రవితేజ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో థియేటర్లలో పూనకాలు లోడింగ్ అయ్యాయి.

యాక్షన్ ఎపిసోడ్స్, చిరు కామెడీ టైమింగ్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇక సంక్రాంతి 2023 Sankranthi 2023 విన్నర్ అంటే చిరు అనే చెప్పాలి

Exit mobile version
Skip to toolbar