Site icon Prime9

Chiranjeevi: ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు.. కానీ, నట ప్రస్థానికి 50 ఏళ్లు – స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన చిరు

Chiranjeevi 50 Years of Acting

Chiranjeevi Completes 50 Years in Acting: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. క్యారెక్టర్ అర్టిస్టు నుంచి మెగాస్టార్ వరు ఆయన ఎదిగిన తీరు నేటి తరానికి స్ఫూర్తి. నటుడిగా ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నారు. అయినా నిరాశ పడకుండ అవకాశాల వెంట పెరుగెత్తారు. నటుడిగాస్వయంకృషితో ముందుకుసాగారు. అలా ఒక్కొక్కొ మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారు. అలా అని స్టార్ అనే గర్వాన్ని తలకి ఎక్కించుకోలేదు.  తన మూలాలను మరిచిపోకుండా ఒదిగి ఉన్నారు. హీరో ఎన్నో సినిమాలు చేసినా.. ప్రతి సినిమాకు తనలో ఓ కొత్త నటుడినే చూసుకున్నారు.

ఎంత ఎదిగిన ఒదిగిపోతూ ‘మెగాస్టార్’ అనే బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్నారు.  ఇండస్ట్రీలో ఆయన వేసిన బాటలోనే ఇప్పుడు ఎంతోమంది హీరోలుగా వచ్చి.. స్టార్స్ అయ్యారు. అలా కొణిదెల శివశంకర్ వర ప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఎదిగిన ఆయన నటప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తి అనడంలో అతిశయోక్తి లేదు.  ‘పునాది రాళ్లు’ చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టారు చిరు. ఆయన వెండితెర ఎంట్రీ ఇచ్చిన 45 ఏళ్లు అవుతుంది. కానీ చిరు నటప్రస్థానం మాత్రం నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుందట. అవును.. 1974లో నటుడిగా ఆయన కాలేజీలోనే తొలి అడుగు వేశారు. బీ.కామ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో కాలేజీలో రాజీనామా అనే నాటకం వేసి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా గెలుచుకున్నారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కాలేజీ రంగస్థలంపై ఆయన వేసిన తొలి నాటకం ఫోటో షేర్ చేసుకుని ఈ మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.  ఈ సందర్భంగా చిరు ఇన్‌స్టాగ్రామలో పోస్ట్‌ షేర్‌ చేశారు.  ‘రాజీనామా’ .. Y N M College Narsapurలో ‘రంగస్థలం’ మీద తొలి నాటకం.. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు.. అది Best Actor కావటం.. ఎనలేని ప్రోత్సాహం. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఎనలేని ఆనందం” అంటూ ఎమోషనల్ అయ్యారు.  ఈ సందర్భంగా డిగ్రీలోని తన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ మెగా ఫ్యాన్స్ కి చాలా స్పెషల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతేకాదు సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ చిరుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా చిరు తన 45 ఏళ్ల కెరీర్ లో చిరు 157 చిత్రాలు చేశారు. ప్రస్తుతం 158, 159 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 158వ చిత్రంగా ‘విశ్వంభర’ తెరకెక్కుతుండగా.. 159వ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది.

Exit mobile version