Site icon Prime9

Tollywood: ఒకే ఫ్రేంలో చిరంజీవి, నాగార్జున, మహేష్‌ బాబు – మాల్దివులో సందడి, అభిమానులకు కనువిందు..

Chiranjeevi, Nagarjuna and Mahesh Babu in One Frame: రీల్‌పై తమ అభిమానుల హీరోలు కలిసి కనిపిస్తే చాలు ఆయా హీరోల ఫ్యాన్స్‌కి పండగే. ఇక బయట ఒకరిద్దరు కలిసిన అభిమనులంతా మురిసిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ముగ్గురు అగ్ర హీరోలు ఒకే ఫ్రేంలో కనిపించి కనువిందు చేశారు. అదీ కూడా అందమైన వెకేషన్‌ స్పాట్‌లో. మెగాస్టార్‌ చిరంజీవి, ‘కింగ్‌’ నాగార్జున, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబులు ఒకే పార్టీలో సందడి చేశారు. అదీ కూడా మాల్దీవులులోని ఓ ప్రైవేట్‌ పార్టీలో. ఈ ముగ్గురు కలిసి టైనింగ్‌ టెబుల్‌ దగ్గర కూర్చోని కనిపించారు.

ముగ్గురు పక్కపక్కనే కూర్చోని ఫోటోకి అలా ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఈ ముగ్గురు హీరోలను ఒకే ఫ్రేం చూసి వారి ఫ్యాన్స్‌ అంతా తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. కాగా ప్రముఖ వ్యాపారవేత్త నిర్వహించిన పార్టీలో వీరు పాల్గొన్నట్టు తెలుస్తోంది. సదరు వ్యాపారవేత్త బర్త్‌ను మాల్దీవులో నిర్వహించగా.. ఈ పార్టీలో మహేష్‌ బాబు తన సతీమణి నమ్రత శిరొద్కర్‌తో కలిసి పాల్గొన్నాడు. అలాగే వీరితో పాటు అఖిల్ అక్కినేని కూడా ఉన్నాడు. ఇటీవల మహేష్ బాబు, అఖిల్ హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వెళుతున్న వీడియో వైరలైన సంగతి తెలిసిందే.

Exit mobile version