Site icon Prime9

Chiranjeevi: మీడియాపై చిరంజీవి ఆగ్రహం..!

MEGASTAR chiranjeevi fires on media

MEGASTAR chiranjeevi fires on media

Chiranjeevi: మేమేం చెయ్యాలో కూడా మీడియానే నిర్ణయిస్తే ఎలా అంటూ మెగాస్టార్ చిరంజీవి మీడియాపై ఫైర్ అయ్యారు. మరల అంతలోనే మా సినిమా గురించి బాగా రాశారు అందుకు థాంక్యూ అంటూ పొగిడారు. ఇదంతా నిన్న అనగా శనివారం నాడు జరిగిన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్లో జరిగింది.

చిరంజీవి హీరోగా ఇటీవల రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి విదితమే. సినిమా సెక్సెస్ ను అటు మూవీ మేకర్స్ ఇటు అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. కాగా శనివారం గాడ్ ఫాదర్ చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ కి ముందు గాడ్ ఫాదర్ గురించి మీడియా ఇష్టం వచ్చినట్టు రాశారు. సినిమా షూట్ లేట్ అయిందని, సినిమా బాగోలేదు అని, ప్రమోషన్స్ మొదలు పెట్టలేదని, సినిమాలో ఏం లేదు అని, రీమేక్ సినిమా అంత హైప్ లేదని రాశారు. మాకు ఆ వార్తలు చాలా ఇబ్బందిగానూ, చిరాకును కలిగించాయి. మా సినిమాని ఎప్పుడు ఎలా ప్రమోట్ చేయాలో మాకు తెలీదా. మీడియా ఎందుకు డిస్ట్రబెన్స్ చేస్తుంది అని ఆలోచించామని అసలే సినిమా లేట్ అవుతుందని మేము కంగారు పడుతుంటే మధ్యలో దీని గురించి ఆలోచించాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు.

మరోవైపు ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు వర్షంలో కూడా నేను మాట్లాడడానికి కారణం మీడియా ఏది పడితే అది రాయకూడదే అంటూ చెప్పుకొచ్చారు. ఎవ్వరూ దీని గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దనే నేను అంత వర్షంలోనూ మైక్ తీసుకుని మాట్లాడనని తెలిపారు. ఇప్పుడు మీడియా అంతా సినిమా హిట్ అయినందుకు బాగా రాస్తున్నారు. సినిమా ముందు మమ్మల్ని టెన్షన్ పెట్టారు కానీ రిలీజ్ అయ్యాక బాగా ప్రమోట్ చేశారు అందుకు చాలా థ్యాంక్స్ అని చిరంజీవి తెలిపారు.

ఇదీ చదవండి: థియేటర్లలోకి “రెబల్” మళ్లీ వచ్చేస్తున్నాడు..!

Exit mobile version