Chiranjeevi Roja: వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా మంత్రి రోజాపై చిరు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వైసీపీ మంత్రిగా రోజా ఉన్నారు. పలు సందర్భాల్లో రోజా పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి రోజా గురించి పలు ప్రశ్నలు అడగ్గా వాటికి చిరు ఓపిగ్గా సమాధానం చెప్పారు.
రోజాపై చిరు కామెంట్స్
ముగ్గురు అన్నదమ్ములను ఓడగొట్టామని రోజా ఓ సందర్భంలో అన్నారు. దీనిపై స్పందించిన చిరంజీవి (Chiranjeevi) అలాంటి వాటికి సమాధానం చెప్పి తన స్థాయిని తగ్గించుకోనని అన్నారు. తాను చేసిన సేవలను ప్రజలు గుర్తిస్తే చాలనిఅలాంటి వారు ఎన్ని మాటలన్న పెద్దగా పట్టించుకోనని చిరంజీవి అన్నారు.
తన ఇంట్లో మనిషిగా రోజా ఉండేదని.. అలాంటి రోజాపై కామెంట్ చేయడం తనకు నచ్చదన్నారు. వారు ఎలాంటి కామెంట్లు చేసిన.. తన పని తాను చేసుకుపోతానని అన్నారు.
రాజకీయాల గురించి ఏమన్నారంటే
పరోక్షంగా స్పందించిన చిరంజీవి(Chiranjeevi) .. సమయానికి తగినట్లు తనకు మారడం రాదని.. ప్రేమ చూపించిన తనకు అనుచిత వ్యాఖ్యలు చేయడం రాదన్నారు. రాజకీయాల్లోకి వెళితే ఇలాగే మారిపోతారా అని చిరంజీవి ప్రశ్నించారు. తనతో నటించిన వారితో అప్పుడేలా ప్రేమగా ఉన్నానో ఇప్పుడు అంతే ప్రేమతో ఉన్నానని తెలిపారు. పవన్ కళ్యాణ్ ని తమ్ముడిగా చూస్తానే తప్పా.. రాజకీయంగా ఎలాంటి సపోర్ట్ చేయనని చిరంజీవి (Chiranjeevi) తెలిపారు.
జనసేనకు మద్దతు ఇస్తారా
వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇస్తారా అనే విషయం అడగ్గా.. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తమ్ముడు అనుకున్నది సాధించాలనే కోరుకుంటాను తప్పా.. ప్రత్యక్షంగా సపోర్ట్ ఇవ్వడం ఉండదని తెలిపారు. ఇక రాజకీయాల గురించి కూడా చిరంజీవి తన మనసులో మాట చెప్పారు.
గాడ్ ఫాదర్ సినిమాలో తను చెప్పింది కేవలం డైలాగ్ మాత్రేమేనని.. ఆ డైలాగ్ ని తనకి ఆపాదించడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. తను రాజకీయాలను దూరంగా ఉన్నానని తెలిపారు. రాజకీయాల గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడటం లేదని అన్నారు. సినిమా పరిధి వరకే డైలాగ్ చెప్పడం జరుగుతుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
Package Star Jagan: ప్యాకేజీ స్టార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి: శవాలపై పేలాలు ఏరుకోవడం అంటే ఇదే.. ఇందుకే పవన్ కళ్యాణ్ తిట్టేది..
Lokesh -Tarak: గన్నవరం బరిలో తారకరత్న?.. లోకేశ్ మాస్టర్ స్ట్రోక్
DL Ravindra Reddy: చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిస్తే జగన్ పార్టీకి సింగిల్ డిజిట్.. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/