G20 Summit: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో ప్రధాని మోదీ భేటీ

ఇటీవల బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన నేత రిషి సునాక్ మంగళవారం తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఒకరికొకరు ఎదురుపడి ఇద్దరు నేతలు పలకరించుకున్నారు.

G20 Summit: ఇటీవల బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన నేత రిషి సునాక్ మంగళవారం తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఒకరికొకరు ఎదురుపడి ఇద్దరు నేతలు పలకరించుకున్నారు. ఈ భేటీకి హాజరైన రిషి సునాక్ మోదీ కనిపించగానే ఆయన వద్దకు వచ్చి పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ భేటీలో దేశ సంబంధ చర్చలేమీ జరుగపలేదు.

వాస్తవానికి జీ20 సదస్సులో భాగంగా భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు బుధవారం జరగనున్నాయి. ఈ చర్చల్లో తమ తమ దేశాల అధికార ప్రతినిధులతో కలిసి మోదీ, సునాక్ పాల్గొననున్నారు. అయితే ఒకే దేశానికి చెందిన నేతలు కావడంతో వీరిద్దరూ తొలి రోజే ఎదురుపడిన సందర్భంగా పలకరించుకున్నారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులైన నారాయణ మూర్తి కుమార్తెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: జీ20 శిఖరాగ్ర సమావేశంలో కరోనా కలకలం