Site icon Prime9

Alia Bhatt : డీప్‌ ఫేక్‌ ఫోటోమార్ఫింగ్ భారీనా పడిన అలియాభట్‌.. వైరల్ గా మారిన ఫేక్ పిక్

bollywood heroin-alia-bhatt-deep fake-pic-gone-viral on media

bollywood heroin-alia-bhatt-deep fake-pic-gone-viral on media

Alia Bhatt : హీరోయిన్ ఆలియాభట్ కి సంబందించి ఓ పిక్ సోషల్ మీడియా అంతా దుమారం రేపుతుంది . ఏఐ టెక్నాలజీ గురించి అందరికీ తెలిసిందే అయితే ఇది ఎంత ఉపయోగపడుతుందో, అంతకంటే ఎక్కువగా దుర్వినియోగం అవుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. వారి ఫేస్‌లను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వారి పరువు పెట్టి తీస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా దీనికి బలయ్యింది. ఆమె కోసం దేశం మొత్తం నిలబడింది. రష్మికకు సంబంధించిన ఓ వీడియో ఎంత వైరల్ గా మారిందో అందరికీ తెలుసు.

ఆ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో రష్మిక తన ఎద అందాలని బాగా ఎక్స్‌పోజింగ్ చేసి చూపారు. కాగా ఇది ఫేక్ వీడియో అని తేల్చేశారు. అసలు సదరు వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కి సంబంధించినదని తేల్చేశారు. ఆ తర్వాత కత్రినా కైఫ్‌, సారా టెండుల్కర్‌, కాజోల్‌ ఫోటోలు, వీడియోలను సైతం ఇలానే మార్ఫింగ్‌ చేశారు. డీప్‌ ఫేక్‌ ఫోటోలతో రచ్చ చేశారు. నెక్స్ట్ ఎవరా అనుకునే టైమ్ కి ఇప్పుడు అలియాభట్‌ని టార్గెట్‌ చేశారు.

ఓ లేడీకి అలియాభట్‌ ఫేస్‌ని యాడ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదలగా అది దుమారం రేపుతుంది. ఇందులో బ్లూ ఫ్లోరల్‌ ధరించిన లేడీ చాలా బోల్డ్ గా కూర్చొని ఉంది. ఆమె ఫేస్‌కి అలియా భట్‌ (Alia Bhatt) ఫేస్‌ యాడ్‌ చేయగా అది ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. దీనిపై ఆమె అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. వారిని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏఐ కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలానే వదిలేస్తే సామాన్యులను కూడా టార్గెట్ చేస్తారు కాబట్టి తగిన చర్యలు త్వరగా తీసుకోవాలి అని కామెంట్స్ లో తెలుపుతున్నారు.

అలియాభట్‌.. ప్రస్తుతం `జిగ్రా` అనే మూవీలో నటిస్తుంది. దీనికి ఆమె కూడా నిర్మాత కావడం విశేషం. ఇక రణ్‌బీర్‌ని కపూర్‌ని పెళ్లి చేసుకున్న అలియాభట్‌.. ఆ మధ్యనే కూతురుకి జన్మనిచ్చింది. కొన్ని రోజులు మాతృత్వాన్ని ఆస్వాధించిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతుంది. అలియాభట్‌.. ఇటీవల `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ కహాణి` చిత్రంలో నటించింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతోపాటు హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `హార్ట్ ఆఫ్‌స్టోన్‌` చిత్రంలో మెరిసింది. ఇదిఇలా ఉంటే గతేడాది ఈ బ్యూటీ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చి ఎందరినో అభిమానులను చేసుకుంది .

Exit mobile version