Site icon Prime9

Parineeti Chopra : సౌత్ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ !

bollywood actress parineeti chopra comments about acting in south films

bollywood actress parineeti chopra comments about acting in south films

Parineeti Chopra : బాహుబలి , బాహుబలి 2 , కేజీఎఫ్ , ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 , పుష్ప , కాంతారా వంటి చిత్రాలు దేశ వ్యాప్తంగా సత్తా చాటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రిలో దక్షిణాది సినిమాల కన్నా బాలీవుడ్ దే ఎక్కువ హవా నడిచేది. కానీ బాహుబలి తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా సౌత్ సినిమాలకి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బాలీవుడ్ ప్రముఖులు కూడా సౌత్ సినిమాలను బాగా మెచ్చుకుంటున్నారు. ఇక్కడి సినిమాల్లో నటించడానికి, తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదే సంధర్భంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా సౌత్ హీరోల సరసన నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిస్తుంది. అలియా భట్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి మెప్పించగా, అనన్య పాండే ” లైగర్ ” మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ప్రియాంక చోప్రా, కత్రీనా కైఫ్, ఐశ్వర్య రాయ్, కాజోల్, బిపాసా బసు , విద్యా బాలన్ వంటి ప్రముఖ హీరోయిన్లు కూడా దక్షిణాది సినిమాల్లో నటించారు.

తాజాగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా సౌత్ సినిమాల్లో అవకాశం ఇవ్వండి అని అంటూ మీడియా ఎదుట మాట్లాడడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా కాజిం సిస్టర్ లాగా బాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ … తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్‌తక్‌ 2022 అనే కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన మనసులో మాటని బయట పెట్టింది.

ఈ సంధర్భంగా పరిణీతి మాట్లాడుతూ… నేను సౌత్ సినిమాల్లో నటించడానికి ఎదురు చూస్తున్నాను. సౌత్ సినిమాల్లో నటించడానికి ఎంతలా ఆరాట పడుతున్నానో మీకు తెలియదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఏ భాష అయినా పర్లేదు… సౌత్ లో ఒక మంచి సినిమాలో నటించాలనుకుంటున్నాను అని తెలిపింది. దయచేసి మీకు తెలిసిన దర్శకులు ఉంటే వారికి నా గురించి చెప్పండి అంటూ మీడియా ని రిక్వెస్ట్ చేసింది. దీంతో పరిణీతి చెప్పిన ఈ వ్యాఖ్యలు ట్రెండింగ్ గా మారాయి.

Exit mobile version