Site icon Prime9

Raja Singh Suspension: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ వేటు

Hyderabad: మహ్మద్ ప్రవక్త పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను మంగళవారం ఉదయం పోలీసులు రాజా సింగ్ ఇంటికి వెళ్ళి అరెస్టు చేసి రాజా సింగును అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సౌత్, ఈస్ట్, వెస్ట్ జోన్‌ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై ఫిర్యాదులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఒక వీడియోలో మహ్మద్ ప్రవక్త పై అవమానకరమైన , ఇబ్బంది కరంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన అవమానకర ఆరోపణల పై గోషామహల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మంగళవారం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు, కొన్ని గొడవలు నెలకొన్నాయి. కొన్ని గంటల తర్వాత పోలీసులు రాజా సింగ్ ఇంటికి వెళ్ళి ఆయనను అరెస్టు చేశారు.

రాజా సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పార్టీ శాసనసభ్యులు మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కార్పొరేటర్‌లు పోలీసు స్టేషన్‌లకు చేరుకున్నారు. అక్కడ కూడా పెద్ద ఎ త్తున నిరసనలు జరిగాయి. రాజా సింగ్‌ను వదలొద్దని కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పోలీసులు తెలిపిన వివరాల బట్టి సౌత్, ఈస్ట్ మరియు వెస్ట్ జోన్‌ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్‌లలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై ఫిర్యాదులు నమోదయ్యాయి. రాజా సింగ్‌పై తమకు ఫిర్యాదు అందిందని, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని దబీర్‌పూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి కోటేశ్వర్ రావు గారు మీడియా ముందు వెల్లడించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295, 505 మరియు 153A ప్రకారం ప్రవక్త పై అవమానకరంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అరెస్టు సమయంలో, గోషామహల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తన యూట్యూబ్ వీడియోను అప్‌లోడ్ చేసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసి వేసిందని , ఆ వీడియో కూడా విడుదలైన తర్వాత వీడియో క్లిప్‌లోని పార్ట్ 2 అప్‌లోడ్ చేస్తానని చెప్పారు. వారు నా వీడియోను YouTube నుండి వీడియోను తొలగించారు. వీడియో విడుదలైన తర్వాత వీడియో యొక్క రెండవ భాగం కూడా ఖచ్చితంగా అప్‌లోడ్ చేపిస్తానని మీడియా ముందు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. నేను ధర్మం కోసం చేస్తున్నాను. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమేనని, అప్పటి వరకు నా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, నేను మాత్రం ధర్మం వైపే ఉంటానని ఎమ్మెల్యే రాజా సింగ్ మీడియా ముందు వెల్లడించారు.

Exit mobile version