Site icon Prime9

Atlee: బాలీవుడ్‌లో మరో సినిమా చేస్తున్న అట్లీ – ఈసారి ఏకంగా ఆ బడా హీరోతో..

Atle Next Team Up With Salman Khan: లాస్ట్ ఇయర్ ‘జవాన్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాడు డైరెక్టర్ అట్లీ. షారుక్ ఖాన్‌తో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లుకు పైగా కలెక్షన్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే తాజాగా మరో బాలీవుడ్‌ స్టార్‌తో డైరెక్టర్ అట్లీ మూవీ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ డైరెక్షర్ అట్లీ నెక్స్ట్ చేస్తున్న మూవీ ఏంటి, అందులో నటించిన హీరోలు ఎవరో చూద్దాం.

తన కెరీర్‌లో ఇప్పటివరకు ఫ్లాప్ ఇవ్వని డైరెక్టర్ అట్లీ. అట్లీతో మూవీ అంటే.. మాస్ ఎలిమెంట్స్‌కు కొదవే ఉండదు. రాజా రాణి మూవీతో స్టార్ట్ చేస్తే తను డైరెక్ట్ చేసిన అన్ని మూవీలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. జావాన్‌తో కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి డైరెక్టర్ అట్లీ షిఫ్ట్ అయ్యారు. కింగ్‌ ఖాన్‌ షారుక్‌ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా వెయ్యి కోట్ల కలెక్షన్స్‌తో మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఇక టాలీవుడ్ విషయానికొస్తే.. 2013లో రిలీజైన ఆర్యా యాక్ట్ చేసిన రాజా రాణి చిత్రంతో డైరెక్టర్‌గా అరంగేట్రం చేసిన అట్లీ వరుసగా “తెరి”, “మెర్సల్” అలాగే “బిగిల్” అనే మూడు సినిమాను విజయ్ తో తీసి బ్యాక్‌ టూ బ్యాక్‌ బ్లాక్‌బస్టర్స్‌ అందుకున్నాడు. ఆ తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత 2023లో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా బాలీవుడ్‌ బాద్‌షానే తన స్క్రిప్ట్‌తో మెప్పించాడు. షారుక్‌, నయనతార హీరోహీరోయిన్లుగా జవాన్‌ మూవీని తెరకెక్కించి భారీ హిట్‌ కొట్టాడు. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌ సుమారు రూ. 1,148 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి రికార్డ్స్‌ బద్దలు కొట్టింది.

వరుస డిజాస్టర్స్‌ ఢిలా పడ్డ హిందీ బాక్సాఫీసుకు రికార్డు బద్దలయ్యే బ్లాక్‌బస్టర్‌ని అందించిన ఆదుకున్నాడు అట్లీ. మూవీ డైరెక్టర్ గానే కాకుండా “స౦గిలి బుంగిలి కథవ తొర” “అంధకారం” అనే మూవీస్ కు ప్రొడ్యూసర్ గాను వ్యవహరించారు అట్లీ. ప్రజెంట్ హిందీలో తెరకెక్కుతున్న “తెరి” మూవీని రీమేక్ చేస్తూ “బేబీ జాన్” అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నటుడిగా కూడా పలు చిత్రాల్లో నటించిన మరోసారి బాలీవుడ్‌లో తన సత్తా చాటుకునే ప్లాన్‌ ఉన్నాడు. అక్కడ మరో మూవీ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం ఓ టాప్‌ హీరోని లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఆయనకు స్టోరీ లైన్‌ చెప్పగా వెంటనే ఒకే చెప్పినట్టు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకి అట్లీకి ఒకే చెప్పిన ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్‌ ‘భాయిజాన్‌’ సల్మాన్‌ ఖాన్‌ అని తెలుస్తోంది. అట్లీ నెక్ట్స్‌ సల్మాన్‌తో జతకట్టబోతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ డెవలప్‌ చేసే పనిలో ఉన్నాడట. ఇది ఒక ఫాంటసీ పీరియాడిక్‌ సినిమా అని, చారిత్రాత్మక సినిమా అని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తుండగా.. ఇది మల్టీస్టారర్‌ మూవీ అని టాక్‌. ఇందులో మరో హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. మరి దీనికి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Exit mobile version