Varahiyatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి వారాహి యాత్రను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వారాహి యాత్ర ప్రారంభం అవుతుండడంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జనసేన సమన్వయకర్తలను నియమించారు.
సమన్వయ కర్తలు వీరే..(Varahiyatra)
నర్సీపట్నం నుంచి బొలిశెట్టి సత్యనారాయణ, వంపూరు గంగులయ్య, పాయకరావు పేట నుంచి గడసాల అప్పారావు, మూగి శ్రీనివాస్, యలమంచిలి నుంచి బండ్రెడ్డి రామకృష్ణ, బేతపూడి విజయశేఖర్, తుని నుంచి బోనబోయిన శ్రీనివాస యాదవ్, తాతంశెట్టి నాగేంద్ర, ప్రత్తిపాడు నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి, అక్కల గాంధీ, పిఠాపురం నుంచి బొమ్మిడి నాయకర్, చిల్లపల్లి శ్రీనివాస్, కాకినాడ రూరల్ నుంచి నయుబ్ కమల్, కాకినాడ అర్బన్ నుంచి గాదె వెంకటేశ్వర రావు, ముమ్మడివరం నుంచి బొలిశెట్టి సత్యనారాయణ, అమలాపురం నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, పి.గన్నవరం నుంచి గడసాల అప్పారావు, రాజోలు నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి నియమించారు. జనవాణి కార్యక్రమం సమన్వయ కర్తగా వరప్రసాద్‌ను ఎంపిక చేశారు.